Viral Video of A Hospital Elevator: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నికొన్ని సందర్భాల్లో ఆ సంఖ్య వందల్లోనూ ఉంటుంది. అయితే, అందులో కొన్ని వైరల్ వీడియోస్ కి సంబంధించిన వివరాలు ఉండవు కానీ అందులో ఉండే వీడియో మాత్రం అందరికీ రీచ్ అవుతుంది. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయే వైరల్ వీడియో కూడా. ఈ వీడియోలో ఉన్న ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు కానీ.. వీడియో చూస్తే మీరు షాక్ అవడం మాత్రం పక్కా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్పత్రిలో రోగులను ఒక వార్డు నుంచి మరొక వార్డుకు మార్చేటప్పుడు, లేదా వార్డు నుంచి ఆపరేషన్ థియేటర్ కి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు లిఫ్టులు ఉపయోగించాల్సి వస్తుంది. ఈ వీడియోలో జరిగిన ఘటన కూడా అలాంటి సందర్భంలోనిదే అని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎలివేటర్ లో సాంకేతిక లోపం కారణంగా స్ట్రెచర్ పై పేషెంట్ ని లిఫ్టులోకి తీసుకెళ్లిన మరుక్షణమే లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో పేషెంట్ తో పాటు అతడి వెంట ఉన్న వారు కూడా షాకయ్యారు. 


ఏం జరుగుతుందో గ్రహించే లోపే లిఫ్టు కిందకు వెళ్లిపోయింది. స్ట్రెచర్ పై ఉన్న పేషెంట్ తలకిందులుగా కిందపడిపోయాడు. అదృష్టవశాత్తుగా లిఫ్టుకి, అంతస్తుకు మధ్య ఎవ్వరూ చిక్కుకుపోనప్పటికీ.. ఈ దుర్ధటనలో లిఫ్టులో ఉన్న వారి పరిస్థితి ఏంటనే విషయంలోనే క్లారిటీ లేదు.

ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్ బయట, లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను లాన్స్ అనే ట్విటర్ హ్యాండిల్ పేరిట ఒక నెటిజన్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఉన్న టైమ్ స్టాంప్ ప్రకారం ఈ ఘటన ఇదే ఏడాది అక్టోబర్ 8న చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 10.8 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈ పోస్ట్ మరింత వైరల్ అవుతోంది.