Watch Viral Video Buffalo Saves Tortoise By Flipping It With Horn : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా మూగ జీవాల వీడియోలే వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఎక్కువగా ట్రెండ్‌ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి.. మరికొన్ని వీడియోలేమో అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా అందరినీ మెప్పిస్తోన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక అడవి దున్న.. తాబేలుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అడవి దున్న చేసిన సాయం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అడవి దున్న (Buffalo) మరో జీవి ప్రాణాలను కాపాడడం ఆ వీడియోలో ఉంది. ఆపదలో ఉన్న తోటి ప్రాణికి సాయం చేసి ఆదర్శంగా నిలిచింది ఆ మూగజీవి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో మస్తు వైరల్ (Viral) అవుతోంది. 


సాధారణంగా దున్నపోతులు అందులో అడవి దున్నలు ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఎదుట ఉన్న వాటిని కొమ్ములతో ఎత్తి పడేస్తుంటాయి. కానీ వాటికి కూడా ఇతర జీవులపై ఎంతో కరుణ ఉంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.


ఈ దున్న కొమ్ములతో మరో జీవి ప్రాణం తీయలేదు... తన కొమ్ములతో మరో జీవి ప్రాణాలను కాపాడింది. ఇదంతా ఒక జూలో జరిగినట్లు తెలుస్తోంది. అక్కడున్న ఒక తాబేలు ఇసుకలో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ బోర్లా పడిపోయింది. ఉల్టాగా పడ్డ ఆ తాబేలు మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


Also Read : KGF 2 Movie: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా?


అయితే తాబేలు ప్రయాసను గమనించిన ఒక దున్న.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ముతో (Horn) తాబేలును మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చింది. అది తిరిగి పైకి లేచేలా చేసింది దున్న. అలా తాబేలుకు (Tortoise) సాయం చేసి అందరి మన్ననలు పొందుతోంది ఆ దున్న (Buffalo). ఇక ఇదంతా అక్కడే ఉండి చూస్తోన్న కొందరు ఆ దున్నను అభినందిస్తూ కేకలు వేశారు.



 


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సాయం చేసే గుణం నోరులేని జీవాలు కూడా చాలా ఎక్కువే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : అదృష్టం అంటే ఇదేమరి.. బౌల్డ్‌ అయినా బ్యాటింగ్ కొనసాగించిన బ్యాటర్‌!! (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook