Viral Video today:  సోషల్ మీడియాలో ఏదో విధంగా ఫేమస్ అయిపోవాలని వెరైటీ వీడియోలు చేస్తున్నారు కొందరు. వారి ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఓ యువకుడు గేదె మీద సవారీ చేసి నవ్వులపాలైన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో bull_rider_077 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ యువకుడు రద్దీగా ఉండే రోడ్డుపై గేదెపై కూర్చుని సవారీ చేస్తున్నాడు. పైగా హెల్మెట్ కూడా ధరించాడు. గేదెపై వెళ్తున్న ఇతగాడు సడన్ గా దానిపై నుంచి కిందపడతాడు. అదే సమయంలో చాలా వాహనాలు రోడ్డుపై వెళ్తుండటం చూడవచ్చు. మళ్లీ ఎలాగోలా కూర్చుని గేదెను వేగంగా పరిగెత్తిస్తాడు. గేదెపై ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యూస్ కోసం ఇలా చేస్తే  గాయాలు పాలవ్వడమో లేదా ప్రాణాలు పోవడమో జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది


ఈ వీడియోకు నాలుగు లక్షలపైగా లైక్స్ రాగా.. మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది జంతు హింస అని ఒకరు కామెంట్ పెడితే.. ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలని మరోకరు అంటున్నారు. ఇంకొకరు అయితే ఇలాంటి రీల్స్ కు లైక్ కొట్టదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో వేల వీడియోలు డంప్ అవుతున్నాయి. ఇందులో కొంచెం వెరైటీగా ఉంటే చాలు నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. 



Also Read: Costly Beggar: వావ్.. యాచకురాలి వద్ద కాస్లీ ఐఫోన్.. అవాక్కైన పోలీసులు.. ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook