Aadhaar and Pancard: నిత్య జీవితంలో ప్రతి ఒక్క దానికీ ఆధార్ , పాన్‌కార్డులు అవసరంగా మారాయి. పాస్‌పోర్ట్ కాదు కదా ఆఖరికి సిమ్‌కార్డు కావాలన్నా సరే ఆధార్‌ కార్డు లేకుండా జరగదు. అదే వ్యక్తి మరణిస్తే..ఆ పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్ని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డు, పాన్‌కార్డులు(Aadhaar and Pancards)నిత్య జీవితంలో ఎంతగా అవసరమో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా అంతే ఎక్కువ. సంక్షేమ పథకాల లబ్ది లేదా దైనిక అవసరాలు ప్రతి ఒక్కటికీ ఆధార్ కార్డు లేదా పాన్‌కార్డు తప్పనిసరిగా మారింది. అందుకే ఆధార్ కార్డు , పాన్‌కార్డులు చాలా అవసరం. అదే వ్యక్తి మరణించిన తరువాత ఆ ఆధార్ కార్డు లేదా పాన్‌కార్డుల్ని ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఆధార్‌, పాన్‌‌కార్డులు పోగొట్టుకుంటే చాలా అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరణించిన వారి కార్డులను ఎన్ని రోజులని భద్రపరచాలనే సందేహం కూడా కీలకమైనది. అయితే మరణించిన వ్యక్తి ఐటీ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పాన్‌కార్డును జాగ్రత్తగా భద్రపరచాలి. ఐటీ రిటర్న్స్‌లోని నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేంత వరకు పాన్‌కార్డు యాక్టివ్‌గా ఉండాలి. ఉద్యోగి డిపార్టుమెంట్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు మనుగడలో ఉండాలి. ఇవన్నీ పూర్తయ్యాక ఇక ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయవచ్చు. పాన్‌కార్డును క్లోజ్ చేయాలంటే.. తొలుత ఆదాయపు శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఇందులో వారి పూర్తి వివరాలను పొందపరచాలి. వ్యక్తి పేరు పాన్‌కార్డు(Pancard) నంబర్ మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వీటన్నింటిని జత చేసి ఐటీ శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం పాన్‌కార్డు క్లోజ్ అవుతుంది. 


పాన్‌కార్డు క్లోజింగ్‌కి సంబంధించిన దరఖాస్తుని మరణించిన వారి చట్టపరమైన వారసులే సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగే ప్రక్రియలో కూడా వారసులే కీలకం. ఇతరులు చేయడానికి వీలులేదు. మరణించిన వారి పాన్‌ కార్డుని వారి వారసుల అభ్యర్థన మేరకు వేరే వారికి బదిలీ చేయోచ్చు. భవిష్యత్ లో ఆ పాన్ కార్డుతో అవసరం ఉంటుందనుకుంటే క్లోజ్ చేయకూడదు. ఆదాయపు శాఖకు(Income Tax Department) చెల్లించాల్సిన పని లేదు. అయితే ముందుముందు ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తే మాత్రం క్లోజ్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది దుర్వినియోగం జరిగితే లేనిపోని చిక్కులు వస్తాయని చెబుతున్నారు. ఇక ఆధార్ కార్డుదీ అదే పరిస్థితి. ప్రతి ఒక్కదానికీ అవసరమే ఇది. అయితే పాన్ కార్డులా ఆధార్ కార్డును(Aadhaar Card)క్లోజ్ చేసే పరిస్థితి లేదు. ఒకసారి ఒక నెంబర్ జారీ అయితే ఆ వ్యక్తి బతికున్నా లేదా మరణించినా అతనికే వర్తిస్తుంది. ఆధార్ కార్డును క్లోజ్ చేసే అవకాశం లేదు కాబట్టి..దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా భద్రపర్చుకోవడం అత్యవసరం. 


Also read: Viral Video: ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండ్రా.. ఆవు నేర్పిన పాఠం.. వాడికి మాత్రం గుణపాఠం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి