యువ వ్యాపారవేత్తలకు ఇది మంచి అవకాశం. వాట్సాప్ సంస్థ 'వాట్సాప్ బిజినెస్' అనే పేరుతో ఒక కొత్త యాప్‌ను తీసుకువస్తోంది. ఈ యాప్ జనావళిలోకి వస్తే ఇప్పుడిప్పుడే బిజినెస్ ప్రారంభించాలని భావించే యంగ్ ఎంట్రప్రెన్యూర్స్‌కు మంచి అవకాశమే లభిస్తుంది. ఈ యాప్‌ అచ్చం వాట్సాప్ మాదిరిగానే ఉంటుంది. అయితే దీనిని వేరేగా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరే నెంబరుతో కూడా ఈ యాప్ వాడవచ్చు.


గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చే ఈ యాప్ ప్రస్తుతం అమెరికాలో బాగా విజయవంతమైంది. అలాగే మన దేశంలోకి కూడా త్వరలో అడుగుపెట్టబోతుంది. ఈ యాప్ ద్వారా వ్యాపారులు తమ బిజినెస్ యాక్టివిటీస్‌‌ను ఇతరులతో పంచుకోవచ్చు. అలాగే వస్తువులను అమ్మవచ్చూ.. కొనవచ్చు.  అయితే పూర్తి స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే వ్యాపారులు తమ బిజినెస్‌ను ఈ యాప్ ద్వారా చేసుకోగలుగుతారు. వ్యాపారులు, వినియోగదారులు పరస్పరం మెసేజ్‌లు కూడా ఈ యాప్ ద్వారా పంచుకోవచ్చు. ముఖ్యంగా పలు ఈ కామర్స్ సైట్లకు పోటీగా నిలవడానికి ఈ యాప్ వస్తున్నట్లు తెలుస్తోంది