Viral Short Video: ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ ను చూసేందుకు అలవాటు పడ్డారు. అందుకే షేర్ చేసిన గంటల వ్యవధిలోనే నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. తరచుగా వైరల్ అయ్యే వీడియోలు ఎక్కువగా ఫన్నీ, యాక్సిడెంట్లకు బంధించినవే ఉండడం విశేషం. నెట్టింట్లో షేర్  చేసే వీడియోల ద్వారా ఎలాంటి సమాచారం అయినా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే చాలామంది వైరల్ అవుతున్న వీడియోలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇటీవలే అమెరికాలో జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఆ వైరల్ గా మారిన వీడియో ఏమిటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ మత్స్యకారుడు వేట భాగంగా పడవలో సముద్రంలోకి వెళ్తాడు. ఈ వేటలో అనుకోకుండా మత్స్యకారుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు సముద్రంలో ప్రవహించే నీటిలో చేతులు పెడతాడు. ఇలా చేతులు పెట్టే క్రమంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే.. సరిగ్గా మత్స్యకారుడు సముద్రంలో చేతులు పెట్టి వాటిని శుభ్రం చేస్తూ ఉండగా ఒక్కసారిగా సొర చేప తన చేతులపై దాడి చేసి సముద్రంలోకి లాక్కొని వెళ్తుంది.





ఇలా లాక్కొని వెళ్లిన తర్వాత స్నేహితుడు వెంటనే గమనించి పడవలో ఉన్న స్నేహితుడు అతని చేతులను పట్టుకొని పైనకు లాగే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఎంతో కష్టపడి ప్రయత్నం సముద్రంలో పడిపోయిన మత్స్యకారుడు తిరిగి బోట్ లోకి వస్తాడు. పడవలో ఉన్న తన స్నేహితుడు రక్షించడం వల్లే ప్రాణాలతో తిరిగి వచ్చాడు. లేకపోతే ఆ సొర చేపకు ఆహారం అయిపోయి ఉండేవాడు.


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..


ఈ వీడియోను తన స్నేహితుడు క్యాప్ కెమెరా ద్వారా చిత్రీకరించాడు. ఫ్లోరిడాలోని నేషనల్ ఎవర్‌గ్లేడ్స్ పార్క్‌లో జరిగిని..."భయకరమైన రోజులలో ఒకటి" అని అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయినప్పటికీ స్నేహితుడు నీటిలో చేతులు పెట్టకూడదని ఎన్నిసార్లు హెచ్చరించినా..మాటలు పెడచెవిన పెట్టాడని తెలిపాడు. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు చేతులను నీటిలోకి పెట్టడం చాలా ప్రమాదకరమైనవి ఈ వీడియో ద్వారా వెళ్లడైంది. ముఖ్యంగా సముద్రంలో ప్రయాణం చేసే క్రమంలో చిన్న పిల్లలు తరచుగా నీటిలో చేతులు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టకుండా పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook