Crow Man of India: కాకి మనిషి అంటే ఎవరో తెలుసా ?
Crow Man of India: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక వింత ప్రతిభ ఉంది. అతడు తలుచుకుంటే కాకులను అన్నింటిని ఒక్క చోటుకు పిలిచి కాకుల సమావేశం ఏర్పాటు చేయించగలడు. ఏంటి అర్థం కావడం లేదా ? మరేం లేదండి.. ఇతడికి కాకుల తరహాలో శబ్ధం చేస్తూ కాకులను పిలిచే ఒక యూనిక్ టాలెంట్ ఉంది.
Crow Man of India: క్రో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? అదేంటి.. ఐరన్ మ్యాన్ అని పిలవడం విన్నాం.. సూపర్ మ్యాన్, హీమ్యాన్, శక్తిమ్యాన్ అని మనిషి సృష్టించిన పాత్రలను చూశాం.. కానీ ఈ క్రౌ మ్యాన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ? అయితే ఈ క్రౌ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి మీకు ఇంకా తెలియదనే అనుకోవాలి. కొంతమందికి జంతువలను మచ్చిక చేసుకునే కళ ఉంటుంది. ఇంకొంతమందికి పాముల చేత నాట్యం చేయించే కళ ఉంటుంది. ఇంకొంతమందికి పక్షులతో సావాసం చేసే కళ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ మూడో రకానికి చెందిన మనిషి గురించే.
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక వింత ప్రతిభ ఉంది. అతడు తలుచుకుంటే కాకులను అన్నింటిని ఒక్క చోటుకు పిలిచి కాకుల సమావేశం ఏర్పాటు చేయించగలడు. ఏంటి అర్థం కావడం లేదా ? మరేం లేదండి.. ఇతడికి కాకుల తరహాలో శబ్ధం చేస్తూ కాకులను పిలిచే ఒక యూనిక్ టాలెంట్ ఉంది. అతడు కాకిలా శబ్ధం చేశాడంటే ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎన్ని కాకులు ఉన్నాయో అన్ని కాకులు అతడి వద్దకు ఎగురుతూ వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ శబ్ధం విన్న ఏ కాకి అయినా ఎగురుకుంటూ.. అతడిని వెదుక్కుంటూ వచ్చితీరాల్సిందే. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి.. అసలు సీన్ ఏంటో మీకే అర్థమవుతుంది.
చూశారు కదా.. కాకి శబ్ధం చేయగానే కాకులు అన్ని ఎలా ఎగురుకుంటూ అతడి వద్దకు వస్తున్నాయో.. అందుకే అతడి టాలెంట్ చూసిన జనం అతడికి క్రౌ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టేశారు. ఆ వ్యక్తి కూడా తనకు ఉన్న స్పెషల్ టాలెంట్ కి తనే మురిసిపోతూ.. క్రౌ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ తెచ్చిన ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదిలావుంటే, ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపిస్తోంది. క్రౌ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు సంపాదించుకున్న వ్యక్తిని నెటిజెన్స్ కితాబిస్తున్నారు. ఇంకొంతమంది అతడికి వెరైటీ సలహాలు ఇస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. సోదరా.. మీరు శ్రాద్ధకర్మలకు కాకులను పిలిచే బిజినెస్ ప్రారంభిస్తే.. మంచి బిజినెస్ ఉంటుంది. మీ టాలెంట్ మీకు డబ్బులు కూడా సంపాదించి పెడుతుంది అంటూ సలహా ఇచ్చాడు. ఏదేమైనా మొత్తానికి కాకిలా శబ్ధం చేయగలిగే టాలెంట్ ఉన్నందుకు అతడికి క్రౌ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా దక్కింది.