టెక్ దిగ్గజమైన గూగుల్ ( Google ) కీలక చర్యలకు దిగింది. తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 25 యాప్ ( 25 Apps) లను తొలగించింది. అయితే ఇంత హఠాత్తుగా ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గూగుల్ సంస్థ ప్లే స్టోర్ ( Play store)  నుంచి ఒకేసారి 25 యాప్ లను తొలగించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 2.34 మిలియన్ల డౌన్ లోడ్స్ ఉన్న ఈ యాప్ లను తొలగించడం వెనుక కారణమేంటి? ఈ యాప్ లతో డేటా చోరీ అవుతుందని తెలియడమే. ముఖ్యంగా ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎవినా ( Evina) అందించిన సమాచారం మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ ( Facebook) యూజర్ల క్రెడెన్షియల్స్ ( facebook credentials) అంటే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను ఈ యాప్ లు దొంగిలిస్తున్నట్టుగా ఎవినా సంస్థ గుర్తించింది. దాంతో  రంగంలో దిగిన గూగుల్ తన ప్లే స్టోర్ ( google play store) నుంచి ఆ యాప్ లను తొలగించేసింది. తొలగించేసరికి 2.34 మిలియన్ల డౌన్ లోడ్స్ ఈ యాప్ లకు ఉన్నట్టు తెలిసింది. ఈ అప్లికేషన్లన్నీ వేర్వేరు పేర్లతో ఉన్నా..ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. ఈ యాప్ లలో ఇమేజ్ ఎడిటరర్స్, వీడియో ఎడిటర్ యాప్స్, ఇతర వాల్ పేపర్ యాప్స్, ఫ్లాష్ లైట్ యాప్స్, ఫైల్ మేనేజర్ , మొబైల్ గేమ్స్ వంటివి ఉన్నాయి. Also read: APPLE: 4 వేల 5 వందల చైనీస్ గేమ్స్ ను తొలగించిన యాపిల్ సంస్థ


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..