Viral Video: బ్యాంక్‌లో పూనకంతో బెంబేలెత్తించిన మహిళ..నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న వీడియో!
Women Dance In Bank Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఓ బ్యాంక్‌లో వింత సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Woman Dance In Bank Viral Video Today: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో వింత సంగట చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ సర్కారు తలపెట్టిన లాడ్లీ బెహనా యోజన కోసం బ్యాంక్ ఖాత కేవైసీ చేయించుకునేందుకు బ్యాంకుల ముందు మహిళలలు లైన్లు కడుతున్నారు. అయితే ఇటీవలే బ్యాంకు kyc కోసం వచ్చి ఓ స్త్రీ వింతగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆమె ప్రవర్తనను చూసిన అక్కడి జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా మరికొందరైతే భయానికి బెంబేలెత్తారు. ఇంతకి ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..లాడ్లీ బెహనా యోజన కోసం గుణ జిల్లాలోని మహిళలంతా ఎస్‌బీఐ బ్యాంక్‌లో కేవైసీ కోసం లైన్లు కట్టారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ కూడా లైన్‌లో నిలబడింది. ఇంతలోనే ఆ మహిళకు ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా జుట్టును విరబోసుకుని కేకలతో డ్యాన్స్‌లు చేసింది. అక్కడే ఉన్న జనాలు ఆమె వింత ప్రవర్తనను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు ఆ మహిళకు దేవత పూనుకుందని శాంతించు శాంతించు అని మొక్కారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
లాడ్లీ బెహనా యోజన పథకం కారణంగా బ్యాంకులో భారీ రద్దీ:
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాడ్లీ బెహనా యోజన మొదటి విడత జూన్ 10న మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ఇందుకోసం ఏప్రిల్ 30 వరకు బ్యాంకు ఖాతను కేవైసీ చేయడానికి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసే క్రమంలోనే చాలా మంది మహిళలు వారి సొంత పనులను వదిలి బ్యాంకుల ముందు లైన్లు కడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook