Woman Passenger And Conductor Argument In Free Bus Journey: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనిలో ఎక్కడి నుంచి ఎక్కడికైన మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. అయితే.. చాలా చోట్ల ఈ ఉచిత బస్సు ప్రయాణాలు రచ్చకు దారితీస్తున్నాయి. సీటు కోసం కొందరు మహిళలు గొడవలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల కండక్టర్ లతో వాగ్వాదానికి దిగుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక .. బస్సులలో తరచుగా మహిళల మధ్య సీటు కోసం మహిళలు, కండక్టర్ లు.. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల.. మహిళలు.. కండక్టర్ లపై బూతులు తిడుతు బస్సులో నానా బీభత్సం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా స్పందించారు. డ్యూటీలో ఉన్న కండక్టర్ లపై దాడులు చేస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అచ్చం ఇలాంటి కోవకు చెందిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది.  


ఒక మహిళ ప్రయాణికురాలు, లేడీ కండక్టర్  ల మధ్య సీటు విషయంలో, స్టాప్ లో ఆపడం విషయంలో గొడవ జరిగింది. అది కాస్త పెరిగి.. తిట్టుకొవడం వరకు వెళ్లింది. డ్యూటీలో ఉన్న కండక్టర్ ను పట్టుకుని మహిళ.. దున్నపోతు మొహందానా.. ఫాల్తూ మొహందానా... అంటూ నానా బూతులు తిట్టింది. బస్సులో ఉన్న ప్రయానికులు ఎంతగా చెప్పిన కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.


Read More: Nivetha Pethuraj: సీఎం కుమారుడు రూ.50 కోట్ల లగ్జరీ బంగ్లా గిఫ్ట్.. ఘాటుగా స్పందించిన హీరోయిన్‌


ఒక డ్యూటీలో ఉన్న కండక్టర్ పట్ల ఇలా ప్రవర్తించకూడదని చుట్టుపక్కల వారు చెప్పడం వీడియోలో రికార్డు అయ్యింది.  అదే బస్సులో ఉన్న ఒక ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని చూసిన నెటిజన్లు ఇలా మాట్లాడటం సభ్యత కాదని కామెంట్లు పెడుతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook