eBaby: ఆన్ లైన్ వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత అన్ని మన కాళ్ల దగ్గరకే వస్తున్నాయి. నెట్టింట్లో ఆర్డర్ చేస్తే..నట్టింట్లోకి వచ్చి పడుతున్నాయి. పుడ్ నుంచి బెడ్ దాకా అంతా ఆన్ లైన్ లోనే..అంతగా ఇది ప్రజలకు చేరువైంది. ఈ ఆన్ లైన్ వ్యాపారం ఎంత వరకు వెళ్లిందంటే..ఏకంగా బిడ్డల్ని కూడా ఆన్ లైన్ ద్వారా కనవచ్చు. ఏంటీ ఆన్ లైన్ లో బిడ్డల్ని కనటమా?మరీ విడ్డూరం కాకపోతే..అనుకోవచ్చు. ఇది నిజమే. ఎలాగంటే..ఏదో బిర్యానీ అర్డర్ ఇచ్చినట్లుగా ఓ మహిళ ఏకంగా 'వీర్యం(Sperm)' కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. ఆర్టిఫిషియ‌ల్ ఇన్‌సెమినేష‌న్(కృత్రిమ గర్భదారణ) ప్రక్రియ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్‌(England)లోని నార్త్ యోర్క్‌షైర్‌కు చెందిన 33 ఏళ్ల స్టెఫెనీ టేల‌ర్(Stephenie Taylor) అనే మహిళకు ఓ పిల్లాడు ఉన్నాడు. వాడికి 5 ఏళ్లు. వాడి పేరు ఫ్రాంకీ. రెండో బిడ్డను కనాలని అనుకుంది. కానీ ఫ్రాంకీ పుట్టిన కొంతకాలానికే స్టెఫెనీ భర్తతో విడిపోయింది. కానీ ఫ్రాంకీకి తోడుగా మరో బిడ్డ ఉండే బాగుండు అనుకుంది. అందుకే రెండో బిడ్డను కనటానికి స్టెఫెనీ నిర్ణయించుకుంది. స్పెర్మ్ డోనర్ కోసం జస్ట్ ఎ బేబీ యాప్‌లో సెర్చ్ చేసి..వీర్యాన్ని ఆర్డ‌ర్ చేసి చేసింది.


Also read: Shocking Video: కార్లో ఎలుగుబంటి...గుండె ఆగినంత పని..నవ్వులు పూయిస్తున్న వీడియో (Viedo)


వీర్యంతో పాటు.. ఇన్‌సెమినేష‌న్ కిట్ కూడా ఆన్‌లైన్‌(online)లో ఆర్డ‌ర్ ఇచ్చింది. దాంతో ఎలా గర్భం ధరించాలో యూట్యూబ్‌(Youtube)లో చూసి తెలుసుకుంది. అలా వీడియోలో చూసి ఆర్డర్ చేసిన ఆ వీర్యాన్ని త‌న అండంలోకి ప్ర‌వేశ‌పెట్టింది టేల‌ర్‌. ఇన్‌సెమినేష‌న్(insemination) చేసుకున్న రెండు వారాల త‌ర్వాత త‌ను గ‌ర్భం దాల్చింది. అలా 9 నెల‌ల త‌ర్వాత పండంటి ఓ ఆడపిల్ల(ebaby)కు జ‌న్మ‌నిచ్చింది స్టెఫెనీ. ఆ పాపకు ఈడెన్ అనే పేరు పెట్టింది. త‌న‌కు వీర్యం ఇచ్చిన దాత‌ను.. ఈడెన్ భ‌విష్య‌త్తులో క‌ల‌వాల‌నుకున్నా త‌నకు ఎటువంటి స‌మ‌స్య లేద‌ని కూడా స్టెఫెనీ చెప్పింది. అయితే.. త‌నకు వీర్యం దానం చేసిన వ్య‌క్తి వివ‌రాల‌ను మాత్రం టేల‌ర్ బయటపెట్టలేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి