RPF personnel saves Woman life while she walking towards a moving train in Mumbai: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్థాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. ట్విట్టర్ యూజర్ మంథన్ కె మెహతా షేర్ చేసిన వీడియో ప్రకారం.. ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్‌లో ఓ యువతి పట్టాలపై నడుచుకుంటూ.. ఎదురుగా వస్తున్న లోకల్  ట్రైన్ వైపు వెళ్ళింది. రైల్వే ట్రాక్‌పై యువతిని గుర్తించిన కొందరు స్టేషన్‌లో అరుస్తూ ఉన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది అరుస్తున్నా.. ఆ యువతి వినలేదు. ట్రైన్ హారన్ కొడుతున్నా పట్టించుకోకుండా.. రైలుకు ఎదుగురుగా దూసుకెళ్లింది. 



సరిగ్గా రైలు యువతిని ఢీకొట్టే సమయానికి రైల్వే పోలీస్‌ వెనుక నుంచి వచ్చి ఆమెను పక్కకు నెట్టివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సరైన సమయంలో ఆర్పీఎఫ్ సిబ్బంది రావడంతో యువతి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ వీడియోను మంథన్ కె మెహతా నెట్టింట పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఆర్పీఎఫ్ సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు. 


Also Read: జాతీయ క్రీడా దినోత్సవం.. మనలో ఆత్మవిశ్వాసం నింపి జోష్‌నిచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే!


Also Read: వందల కోట్ల ఆస్తి.. రెండు పెళ్లిళ్లు.. నాగార్జున గురించి మీకు తెలియని విషయాలివే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి