Woman tries to jump off Mumbai atal setu and cab driver saved immediately video goes viral: కొంత మంది ప్రతిచిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంటారు. ఇటీవల కాలంలో యువత ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. అన్నింటికి కూడా అతిగా స్పందిస్తున్నారు. ఎగ్జామ్ అంటే భయపడుతున్నారు. ఇంట్లో వాళ్లుఏమన్నా అంటే .. కోపంతో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  మరికొందరు ప్రేమించిన అమ్మాయి తమ ప్రేమను..  ఒప్పుకోలేదని కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి తర్వాత ఏవైన భార్యభర్తల మధ్య గొడవలు వచ్చిన కూడా.. ప్రతి చిన్న విషయాలకు రాద్దాంతం చేసుకుంటున్నారు. చాలామంది ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా తమ నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఆత్మహాత్యలు చేసుకునేటపప్పుడు.. కొన్నిసార్లు అక్కడున్న వారు కాపాడుతుంటారు. అయితే..కొంత మంది తమకు ఎందుకులే అని పట్టించుకోకుండా వెళ్తుంటారు. కానీ మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా ..తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి అవతలి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు..


ముంబైలోకి అటల్ సేతు బ్రిడ్జి మీద శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ములుంద్ ప్రాంతానికి చెందినర రీమా ముఖేష్ అనే 56 ఏళ్ల మహిళ  ముంబై అటల్ సేతువద్దకు వచ్చి కూర్చుంది. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటంతో..   ఒక క్యాబ్ డ్రైవర్ గమనించాడు. ఆమె దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే అటల్ బ్రిడ్జీపైన కూర్చుని.. కొన్ని వస్తువుల్ని సముద్రంలో పాడేసింది. క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుతునే.. ఒక్కసారిగా సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. అతను వెంటనే.. సమయస్పూర్తిగా వ్యవహారించి, మహిళ వెంట్రుకలను పట్టుకున్నాడు.


ఆ తర్వాత ఆమె చేతులు పట్టుకుని, సముద్రంలోపడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో అక్కడ నుంచి వెళ్తున్నపెట్రోలింగ్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సదరు మహిళలను చాకచక్యంగా పట్టుకుని మహిళనుజాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు.ఆ తర్వాత అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు. సదరు మహిళ మాత్రం చాలా ఎమోషలన్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది.


Read more: Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


rఆమె సూసైడ్ కు మాత్రం గల కారణాలు తెలియరాలేదు. కానీ క్యాబ్ డ్రైవర్, పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహారించి ఒక నిండు ప్రాణం కాపాడారు.ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు.. శెభాష్ క్యాబ్ డ్రైవర్ అంటూ.. కామెంట్ లు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి