Woman trying to catch python from mud video viral: చాలా మంది పాములు, కొండ చిలువలంటే భయంతో వణికిపోతుంటారు. వర్షాకాలంలో, అడవులకు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి తరచుగా పాములు, కొండ చిలువలు రావడం మనం చూస్తుంటాం. అంతేకాకుండా.. పాములు ఎలుకలవేటలో మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. మరోవైపు కొండ చిలువలు కూడా దట్టమైన అడవులు, గుట్టలలో ఎక్కువగా సంచరిస్తుంటారు. ఇవి కొన్నిసార్లు మనుషులపైకి దాడిచేసి హతమారుస్తుంటాయి. పాములు,కొండ చిలువల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొన్ని వీడీయోలు షాకింగ్ కు గురిచేసేలా ఉంటే, మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. ఈ క్రమంలో నెటిజన్లు సైతం, పాములు, కొండ చిలువల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొంత మంది కొండ చిలువల్ని సైతం ఇటీవల కాలంలో పెంచుకుంటున్నారు. తమ బెడ్ రూమ్ లలో, షేల్ఫ్ లలో కొండ చిలువల్ని ఎక్కువగా పెంచుకుంటారు. అంతేకాకుండా.. కొండ చిలువలు కొన్నిసార్లు మేకలు, కోతులు, తమకన్నా.. పెద్దగా ఉండే జీవుల్నిసైతం మింగేస్తుంటాయి. పంట పొలాల్లో కొండ చిలువలు తరచుగా సంచరిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 


కొండచిలువ పొలంలోనే కదలకుండా తిష్టవేసుకుని కూర్చుంది. ఒక యువతి కొండ చిలువనుగమనించింది. ఏమాత్రం భయపడకుండా దాన్ని చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నిచింది. కొండ చిలువ తోకను పట్టుకుని, బురదలో లాగేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. వట్టిచేతులతో కోండచిలువ తోకను పట్టుకుని వెనక్కు లాగింది. కానీ అది మాత్రం యువతి చేతికి చిక్కకుండా ముందుకు నీళ్లలోనికి వేగంగా వెళ్లిపోయింది.


చివరకు యువతి తోకను పట్టుకుని గట్టిగా లాగుతుండగా.. కొండ చిలువ ఒక్కసారిగా యువతిమీదకు దాడికి దిగింది. వెంటనేయువతి వెంట్రుక వాసిలోదాని దాడినుంచి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు యువతి చేసిన పనికి తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం యువతి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. నువ్వు తోపు తల్లా.. అంటూ కూడా ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.