Woman thrashes husband's alleged girlfriend: అనుమానం పెనుభూతం.. అనే పదం మనం చాలా సార్లు వినే ఉంటాము.. అవునా!  అవునండి ఎదుటివారిపైన అనుమానం ఉంటే వారేం చేసిన మనకు తప్పుగానే అనిపిస్తుంది. ముఖ్యంగా భార్య భర్తల విషయంలో అనుమానం ఉంటే మాత్రం ఇక అంతే! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇపుడు ఈ ముచ్చట ఎందుకు అనుకుంటున్నారా..?? సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. భర్తపై అనుమానం ఉన్న భార్య.. జిమ్ కు వెళ్లి ఒక మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసింది. 


Also Read: Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్


వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన భోపాల్ (Bhopal) లో జరిగింది. ఈ నెల 15 న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే తెగ వైరల్ అవుతుంది. 


యధావిధిగా ఆ రోజు భర్త జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేస్తున్నాడు. తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య బుర్కా ధరించి, తన సోదరితో కలిసి జిమ్ కు వెళ్ళింది. అక్కడ జిమ్ లో వ్యాయామాలు చేస్తున్న భర్త పక్కన ఒక మహిళను చూసింది. అంతే ఇక.. ఆ మహిళతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందన్న భ్రమతో ఆ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేయటం ప్రారంభించింది. 


Also Read: Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్




పక్కన ఉన్న వారు ఎంత సర్దిచెప్పటానికి ప్రయత్నించిన ఆమె మాత్రం బూట్లతో ఆ మహిళపై దాడి చేసింది. చివరికి ఆమె భర్త కూడా ఆ మహిళ ఎవరో తెలియదని ఎంత చెప్పిన భార్య మాత్రం వినకుండా.. ఇష్టం వచ్చినట్లు దాడి చేసింది. 


అంతేకాదండోయ్.. భార్య తన భర్తపై అదనపు వర కట్నం కోసం వేధిస్తున్నాడని ఇది వరకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక చేసేదేం లేక భార్య-భర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే ఉన్న కొంత మంది ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆ వైరల్ వీడియోను మీరే ఒకసారి చూడండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి