Women Fall Down: సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాలని పిచ్చి వేషాలు వేస్తున్నారు. కొందరు మరింత రెచ్చిపోయి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ గ్యాస్‌ సిలిండర్‌ను వాడుకుని డ్యాన్స్‌ చేయాలని చూసింది. సిలిండర్‌ బండపై ఎక్కి డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లాపడింది. సోషల్‌ మీడియాలో డ్యాన్స్‌తో ట్రెండవ్వాలని చూసిన ఆ మహిళ కిందపడడంతో అంతకుమించి ట్రెండ్‌ అయ్యింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mandi Biryani: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిన్న కుటుంబం ఆస్పత్రిపాలు


 


ఎక్కడో తెలియదు కానీ ఓ మహిళ రీల్స్‌ చేసేందుకు వింతగా ఆలోచించింది. ఈ క్రమంలోని గ్యాస్‌ సిలిండర్‌ బండి కనిపించింది. వెంటనే అనుకున్నదే తడువుగా ఇంట్లో నుంచి గ్యాస్‌ సిలిండర్‌ బయటకు తీసుకొచ్చింది. వెంటనే ఒకరి సహాయంతో సిలిండర్‌పైకి ఎక్కింది. ఒక పాటకు డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నం చేసింది. అతి కష్టంగా కొన్ని స్టెప్పులు చేసింది. అనంతరం డ్యాన్స్‌ చేస్తూ ఒకసారి తులిపడబోయింది. మళ్లీ నిలదొక్కుకుని డ్యాన్స్‌ చేసింది.

Also Read: Statue Of Liberty: మారుమూల గ్రామానికి చేరిన ప్రపంచ వింత స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహం


 


అయితే డ్యాన్స్‌లో వేగం పెరగడంతో అదుపు తప్పి ఆమె కింద పడిపోయింది. సిలిండర్‌ కదలిపోవడంతో ఆమె కిందపడిపోగా ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే కిందపడినా కూడా ఆమె నవ్వుతూనే ఉంది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకు మనకు ఈ విన్యాసాలు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. రీల్స్‌ కోసం ఎందుకు హైరానా? అంటూ కామెంట్‌ చేస్తున్నారు. తిక్క కుదిరింది అంటూ మరికొందరు ఘాటుగా చెబుతున్నారు. ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు చేసి ఫేమస్‌ కావాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈమె చేసిన వీడియో డ్యాన్స్‌తో వైరల్‌ కావాలనుకుంది కానీ కిందపడడంతో అనుకున్న దానికంటే ఎక్కువ వైరల్‌ కావడంతో ఆ మహిళ సంతోషంలో ఉండి ఉంటుంది.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి