Women Gym Fight: సిల్లీ కారణంతో.. జిమ్‌లో జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు! వీడియో చూస్తే నవ్వులే
Viral Video, Two Womens Fight for Gym Equipment. జిమ్‌లో పరికరాల కోసం ఇద్దరు యువతులు జుట్టు పట్టుకొని తన్నుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video, Two Womens Ugly Fight for Gym Equipment: చాలా మంది ఉదయాన్నే లేచి జిమ్ చేసుకుని ఎవరి పనులకు వారు వెళుతుంటారు. అందుకే ఏ జిమ్‌లో అయినా ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాంతో జిమ్‌లోని వ్యాయామ పరికరాలను ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి చాలా సమయం కూడా వేచి చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకేసారి ఇద్దరు వ్యాయామ పరికరాలను వాడుకునేందుకు పోటీపడితే.. గొడవ మొదలవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఇద్దరు మహిళల మధ్య చోటుచేసుకుంది.
జిమ్‌లో వ్యాయామ పరికరాల కోసం ఇద్దరు యువతులు జుట్టు పట్టుకొని తన్నుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం... ఓ యువతి స్మిత్ మెషిన్‌పై వ్యాయామం చేస్తోంది. ఇంకో యువతి స్మిత్ మెషిన్ కోసం ఎదురు చూస్తోంది. మెషిన్‌పై ఉన్న యువతి వ్యాయామం ముగించుకోగానే.. అప్పటికే వేచిచూస్తున్న యువతి దాని వద్దకు వెళ్లింది. ఇంతలో వెనకాల నుంచి మరో మహిళ మెషిన్ వద్దకు వచ్చి దాన్ని ఆక్రమించుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఇద్దరి యువతుల మధ్య గొడవ పెద్దది కావడంతో జుట్టు పట్టుకొని పోట్లాడారు. ఇదిగమనించిన కోచ్, ఇతర మహిళలు వారి వద్దకు వచ్చి సముదాయించారు. అయినా వారు ఊరుకోలేదు. దాంతో ఆ యువతులను విడిపించేందుకు అక్కడి వారు నానా తంటాలు పడ్డారు. అయితే ఈ గొడవలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 'స్మిత్ మెషిన్‌తో వ్యాయామం చేయడం కంటే.. ఇలా తన్నుకుంటేనే కొవ్వు తగ్గుతుంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలా కూడా కేలరీలు కరిగిపోయాయి' అని ఒకొకరు ట్వీట్ చేశారు.
Also Read: Impact Player: క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్!
Also Read: వైరల్ వీడియో.. బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook