Internet Speed Test: ఇంటర్నెట్ అనేది ఇప్పుడు నిత్యవసర సేవల్లో ఒకటిగా మారిపోయింది. మొబైల్ నెట్​ కాకుండా వేగవంతమైన ఇంటర్నెట్​ కోసం చాలా మంది బ్రాడ్​ బ్యాండ్ సర్వీసులను తీసకుంటున్నారు. ఇదే సమయంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా.. తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని ఆఫర్లు ఇస్తుంటారు. కనెక్షన్ తీసకున్న తర్వాత నిజంగానే సర్వీస్ ప్రొవైడర్ చెప్పిన స్థాయిలో ఇంటర్నెట్ వస్తుందా? అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలం చూద్దం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకునేందుకు ప్రస్తుతం అనేక వెబ్​సైట్లు, వివిధ యాప్స్​ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ కూడా ఎం-ల్యాబ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని.. హోం పేజీలో సులభంగా స్పీడ్​ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.


ఇంటర్నెట్​ స్పీడ్​ తెలుసుకోండిలా..


ముందుగా స్పీడ్ టెస్ట్​ చేసేందుకు ఎం-ల్యాబ్​కు మీ ఐపీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వచ్చిన రిజల్ట్స్​ను అందరూ చూసే విధంగా పబ్లిష్ చేస్తుంది ఎం-ల్యాబ్​. ఇందులో మీ ఐపీ అడ్రస్ కూడా ఉంటుందని గూగుల్ తెలిపింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారం మాత్రం పబ్లిక్​కు అందుబాటులో ఉండదని వివరించింది.


ఈ ఐదు స్టెప్స్​తో స్పీడ్ టెస్ట్​ తెలుసుకోవచ్చు..


  • ముందుగా.. మీ కంప్యూటర్​ ల్యాప్​డాప్​, మొబైల్ ఫోన్​ లేదా ట్యాబ్​లెట్​లో ఏ బ్రౌజర్లోనైనా గూగుల్​ డాట్​కామ్​ను టైప్​ చేయాలి.

  • ఇందులో 'రన్​ స్పీడ్​ డెస్ట్​' అని సెర్చ్ చేయాలి

  • ఇప్పుడు కొత్త పాపప్​ ఓపెన్ అవుతుంది. ఇందులో Internet speed test అనే ఆప్షన్ కనిపిస్తుంది. 30 సెకన్లలో ఇంటర్నెట్​ స్పీడ్ టెస్ట్ పూర్తచేయొచ్చు.

  • ఇక్కడ బాక్స్​లో ఉన్న స్పీడ్ టెస్ట్ అనే బటన్​పై క్లిక్ చేయాలి.

  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటర్నెట్​ డౌన్​లోడ్ స్పీడ్, అప్​లోడ్ స్పీడ్ ఎంబీపీఎస్​లలో కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడి నుంచి మరోసారి స్పీడ్ టెస్ట్ చేయొచ్చు.


Also read: TATA Digital Payments: డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలో టాటా సంస్థ, త్వరలో ప్రారంభం


Also read: Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook