4 Years Waiting Period Restaurant: బ్రిస్టల్: మామూలుగా అయితే ఆదివారం సెలవు రోజు మీకు నచ్చిన రెస్టారెంట్ లో లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ చేయాలంటే ఏం చేస్తారు.. నేరుగా వెళ్లి హోటల్లో బోజనం చేసి వస్తారు. ఒకవేళ అక్కడ బాగా రద్దీగా ఉంటుంది అనుకుంటే ఇంట్లోంచి వెళ్లడానికి ముందే ఆన్ లైన్ టేబుల్ బుక్ చేసి పెట్టుకుని వెళ్లి తినేసి వస్తారు కదా... కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న ఈ రెస్టారెంట్ లో మాత్రం అలా కాదు.  ఈ రెస్టారెంట్లో సండే రోజు లంచ్ చేయాలన్నా లేక డిన్నర్ చేయాలన్నా.. ఆ టేబుల్ ని నాలుగేళ్లు ముందుగానే బుక్ చేసుకుని ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఈ భూ ప్రపంచంలో అలాంటి హోటల్ కూడా ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును మీకు ఈ సందేహం రావడంలో తప్పు లేదు కానీ ఈ నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం వాస్తవమే. అదేంటి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఏదైనా లగ్జరీ ఎస్‌యూవీ కారుని లక్షలు, కోట్లు పోసి బుక్ చేసుకున్నప్పటికీ.. మహా అయితే ఏడాది లేదా ఏడాదిన్నరకంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా.. మరి తినే తిండి కోసం నాలుగేళ్లు ఆగడం ఏంటి అంటారా ? ఈ రెస్టారెంట్లో సండే లంచ్ కి సండే డిన్నర్ కి ఉండే క్రేజ్ అలాంటిది మరి. 


ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ అనే సిటీలో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ పేరు ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఇది పబ్ కమ్ రెస్టారెంట్ టైప్. ఇక్కడ వీకెండ్స్ లో బోజనానికి ఫుల్ క్రేజ్. క్రేజీ క్రేజీ మెనూతో క్రేజీ క్రేజీ రెసిపీలతో వడ్డి వారించడమే ఇక్కడి స్పెషాలిటీ. అందుకే ఇంగ్లాండ్ వాసులు ఈ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు విపరీతంగా పోటీపడుతున్నారు. ఒకవైపు హోటల్ బిజినెస్ అంతా విపరీతంగా పోటీ ఎదుర్కొంటున్న రోజుల్లోనూ ఇక్కడ సండే లంచ్ చేయాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే అంటే నమ్ముతారా ? కానీ నమ్మితీరాల్సిందే. ఒకవేళ ఇక్కడ బోజనం చేయాలి అనుకుంటే... మామూలు వీక్ డేస్ లో పెద్దగా రద్దీ లేనప్పుడు వెళ్లాల్సిందే. లేదు నేను సండే రోజే ఇక్కడ లంచ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం నాలుగేళ్లు ఆగాల్సిందే.


అయినా.. నాలుగేళ్లు ఆగి మరీ లంచ్ చేసేంత గొప్ప ఏం ఉంటుంది ? నాలుగేళ్లు ఆగి మరీ తినేంత గొప్ప విలువ ఉంటుందా ? అని సండే రోజు అక్కడ బోజనం చేసిన కస్టమర్లని అడిగితే.. వారు అవుననే సమాధానం చెబుతారు. అంతేకాదు.. ఈ రెస్టారెంట్స్ లో మీల్స్ కి అవార్డ్స్ కూడా వరించాయి. అక్కడ బోజనం ఖరీదు కూడా మరీ పెద్ద వేలకు వేలు ఖరీదైన బోజనం కాదు. వాళ్ల కరెన్సీలో అయితే కేవలం 26.95 పౌండ్లు ఒక రకం బోజనం, 21.95 పౌండ్స్ మరో రకం ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మొదటి రకం మీల్స్ కి రూ. 2,835 రెండో రకం మీల్స్ కి 2309 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఇద్దరు మనుషులకు కలిపి. 


వినడానికి విచిత్రంగా ఉంది కదూ.. మీరు కూడా ఎప్పుడైనా ఇంగ్లాండ్ కి వెళ్లి బ్రిస్టల్ సిటీకి వెళ్తే ఈ రెస్టారెంట్లో బోజనం ట్రై చేయండి. అన్నట్టుగా మరో విషయం గుర్తుంచుకోండి.. అలవాటులో పొరపాటుగా పైరవీలు చేయిద్దామనో లేక ఫోన్స్ చేయిద్దాం అనో అనుకోకుండా నాలుగేళ్లు ముందుగానే ఇక్కడ టేబుల్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే మళ్లీ మీరు అంత దూరం వెళ్లి వేస్ట్ అవుద్ది.