Viral video: ప్రతి రోజూ కొన్ని వందల వీడియోలు ఇంటర్నెట్​లో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని కొత్త విషయాలు, జాగ్రత్తలను నేర్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో ఏముందంటే...


ఓ యువతి ఇంటి ఆవరణలో స్కూటీ నెర్చుకునేందుకు స్కూటీపై కూర్చుని సిద్ధంగా ఉంది. ఓ పెద్దాయన ఆ అమ్మాయికి స్కూటీని స్టార్ చేసిన తర్వాత ఎలా నెమ్మదిగా యాక్సిలరేటర్ ఇవ్వాలో ట్రైనింగ్ ఇచ్చి.. ముందుకు వెళ్లిపోయాడు.


ఆ అమ్మాయి స్కూటీ నేర్చుకోవటాన్ని ఆ అమ్మాయి సోదరుడు వీడియో తీస్తున్నాడు.


ఆ యువతి ఒక్క సారిగా స్కూటీ రేస్ పెంచింది. దీనితో స్కూటీ వేగంగా ముందుకు కదిలింది. కానీ ఆయువతికి దానిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. ఇంకో విషయం ఏమిటంటే.. ఆ స్కూటీ స్టాండ్  కూడా తీసి లేదు.


ఇక స్కూటీ వేగంగా వళ్లీ ఆ అమ్మాయికి ట్రైనింగ్ విచ్చిన పెపద్దాయనే ఢీ కొట్టింది. ఆ తర్వాత స్కూటీ కింద పడింది. స్కూటీపై ఉన్న ఆ యువతి ఎగిరి ముందువైపు పడింది.


ఈ ఘటనలోత ఆ యువతికి పెద్దగా గాయాలు కాలేదు కానీ.. ఆ పెద్దాయనకు నేరుగా స్కూటీ గుద్దడం వల్ల స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఆ యువతికి అన్ని జాగ్రత్తలు చెప్పినా.. వాటిని పట్టించుకోకుండా.. గుద్దేసి పైగా నవ్వుతోంది. ఆ పెద్దాయన సీరీయస్​గా అమ్మాయివైపు చూస్తూ.. స్కూటీని పక్కకు తప్పించారు.


అయితే ఇక్కడ ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఎవరికైనా జరగరానిది జరిగి ఉంటే ఏమయ్యేది అని నెజిటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిజమే కదా.. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి.. ఇది ఫన్నీ వీడియోగా మారింది. అదే.. ఎవరిగైనా బలంగా దెబ్బలు తాకి ఉంటే ఇది ఓ ట్రాజెడీ వీడియో అయ్యేది.



ఇంటర్నెట్​లో ఆ యువతిపై ఫన్నీ కామెంట్స్​..


స్కూటీ బేసిక్స్​ నేర్చుకునే రోజే ఇలా గుద్దేసిందేంటి అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. డాడీస్​ లిటిల్ ప్రిన్సెస్​ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఇక ఆ అంకుల్ ఇంకెవరికీ స్కూటీ నేర్పించడు అంటూ కొందరు అంటున్నారు. ఆ అంకుల్​ ఇక ఆ యువతికి స్కూటీకి బదులు సైకిల్ ఇప్పిస్తే సరిపోతుంది అంటూ మరికొంత మంది ఫన్నీగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.


be_harami అనే ఇన్​స్టా పేజీలో ఈ వీడియో అప్​లోడ్ అయ్యింది. కేవలం నాలుగ గంటల వ్యవధిలో 1.2 లక్షల మందికి పైగ వీడియోను లైక్​ చేశారు.


Also read: Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండానే గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. అదెలాగంటే..


Also read: Viral Video: టీచర్​కు పాటతో వీడ్కోలు పలికిన విద్యార్థులు- వీడియో వైరల్​..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook