సాయం చేయాలంటే చేతిలో డబ్బు కాదు.. మనసుంటే చాలని ఓ యూట్యూబ్ స్టార్ (youTube Star) నిరూపించాడు. అసోం, బిహార్ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. లక్షలాది ప్రజలు తమ ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అయితే వీరికి సహాయం చేయాలని యూట్యూబ్ స్టార్ అజేయ్ నగర్ (Ajey Nagar) భావించాడు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలోచిస్తూనే కూర్చోలేదు. తన ఆలోచనను కార్యరూపం దాల్చాడు. అసోం (Assam Floods), బిహార్ (Bihar Floods) రాష్ట్రాలను వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, విరాళాలు ఇచ్చి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు. అజేయ్ మంచి మనసును, సాయం చేసే గుణాన్ని అర్థం చేసుకున్న నెటిజన్లు భారీగా విరాళాలు అందించారు. ఈ మొత్తం రూ.10.31 లక్షలు అయింది. ఈ నగదుకు యూట్యూబ్ స్టార్ తన వంతుగా లక్ష రూపాయాలు జత చేస్తున్నట్లు #CarryMinati తెలిపాడు. RGV ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది..



మొత్తం రూ.11.31 లక్షల రూపాయాలను అసోం, బిహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి సమానంగా అందజేయనున్నట్లు వెల్లడించాడు. తన పిలుపుమేరకు ఓ మంచి పనికోసం విరాళాలు అందించిన అందరికీ యూట్యూబ్ స్టార్ ధన్యవాదాలు తెలిపాడు. చాలా గర్వంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. క్యారీ మినాటీ పేరుతో ఆదివారం రాత్రి 7 నుంచి 12 గంటలవరకు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయడం గమనార్హం.హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్