Rangbhari ekadashi 2023: ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని రంగభరీ ఏకాదశి అంటారు. దీనిని అమలకి ఏకాదశి లేదా ఉసిరి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రంగభారీ ఏకాదశిని కాశీలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివాహానంతరం ఈ ఏకాదశి రోజునే పరమశివుడు, పార్వతీదేవి తొలిసారిగా కాశీకి వచ్చారని, భక్తులు వారికి రంగులు వేసి స్వాగతం పలికారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున శివునికి గులాల్ సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈరోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూజ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగభారీ ఏకాదశి తిథి మార్చి 02, 2023 ఉదయం 6.39 గంటలకు ప్రారంభమై మార్చి 3న ఉదయం 9.12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, రంగభారీ ఏకాదశి మార్చి 3, 2023న జరుపుకుంటారు. ఈ రోజు పూజకు అనుకూలమైన సమయం మార్చి 3, 2023 ఉదయం 08:15 నుండి 09:43 వరకు ఉంటుంది. పారణ సమయం మార్చి 4, 2023 ఉదయం 06:48 నుండి 09:09 వరకు ఉంటుంది.


రంగభారీ ఏకాదశి ఈ 3 రాశుల వారికి వరం
మేషరాశి: మార్చి 3 అంటే రంగభారీ ఏకాదశి రోజు మేషరాశి వారికి చాలా శుభప్రదం కానుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీతంలో పెరుగుదల ఉంటుంది. రోగాల నుండి విముక్తి లభిస్తుంది. 
మిథునరాశి: ఉసిరి ఏకాదశి నాడు మిథున రాశి వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. 
ధనుస్సు: అమలకీ ఏకాదశి ధనస్సు రాశివారికి అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. 
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: March Horoscope 2023: మార్చి నెలంతా వీరికి లక్కే లక్కు... డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి