Holi 2023 Date: రంగుల పండుగ హోలీని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా  జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో ఈ పండుగను దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని పిలుస్తారు. ఈరోజున ప్రజలు రంగులను, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లు కుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌర్ణమి ముందు రోజున హోలికా దహనం చేస్తారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనినే చోటీ హోలీ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు. పండుగ ముగింపు రోజున రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రంగుల హోలీని జరుపుకుంటారు. దీనిని ధులండి అని పిలుస్తారు. 2023 సంవత్సరంలో హోలీ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 


హోలీ 2022 తేదీ
వచ్చే ఏడాది అంటే 2023లో హోలిక దహన్ మార్చి 7, 2023న... రంగుల హోలీని మార్చి 8, 2023న జరుపుకోనున్నారు. ప్రదోష కాలంలో సూర్యాస్తమయం తర్వాత హోలికా దహన్ జరుగుతుంది. ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 6, 2023న సాయంత్రం 04.17 గంటలకు ప్రారంభమై.. మార్చి 7, 2023 సాయంత్రం 06.09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహన్ ముహూర్తం- సాయంత్రం 06:31 - 08:58 వరకు (మార్చి 7). హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు.


Also Read: Lucky Zodiacs: ఈ 5 రాశుల వారు తక్కువ టైం లోనే ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


 


.