Jupiter Planet Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల పరివర్తనం మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. దేవగురు బృహస్పతి ఏప్రిల్ మెుదట్లో మేషరాశిలో సంచరించబోతున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు మేషంలో అడుగుపెట్టబోతున్నాడు. దీని కారణంగా అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం
మీన రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి రెండవ ఇంటికి వెళ్ళబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల కాస్తా జాగ్రత్తగా తీసుకోండి.
మకరం
గజలక్ష్మి రాజ్యయోగం మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీరు సకల సుఖాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్ ను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. హోటళ్లు, టూర్ ట్రావెల్స్ మరియు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యాపారం చేసేవారు లాభపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథునం
గజలక్ష్మి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో ఆదాయ గృహంలో సంచరిస్తాడు. దీంతో మీకు అనేక రకాలుగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సమయంలో  పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 


also Read: Shani Dev: అరుదైన యోగాన్ని చేయబోతున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


డ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.