Budh Gochar 2023 in October: సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. అందుకే ఇతడిని ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. గ్రహాల రాకుమారుడైన బుధుడు అక్టోబరు 1వ తేదీ ఉదయం 08:45 గంటలకు సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించబోతున్నాడు. మిథునం మరియు కన్యా రాశులకు అధిపతిగా బుధుడిని భావిస్తారు. కన్యారాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలోనూ, మీనరాశిలో హీన స్థితిలోనూ ఉంటాడు. బుధ గ్రహానికి సూర్యుడు, శుక్రుడు మరియు రాహువులతో స్నేహం ఉంది, అయితే వారికి చంద్రునితో శత్రుత్వం ఉంది. తెలివితేటలు, ప్రసంగం, విద్య, బోధన, గణితం, తర్కం, జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం, వ్యాపారం మెుదలైన ఆంశాలను బుధుడు ప్రభావితం చేస్తాడు. కన్యారాశిలో బుధుడు సంచారం ఏయే రాశులవారికి మేలు జరగబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. దీని కారణంగా వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు అనారోగ్యం బారి నుండి బయటపడతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారం మెుదలు పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. 
మిధునరాశి
బుధుడి రాశి మార్పు మిథునరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.  రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మకరరాశి
మెర్క్యూరీ గమనంలో మర్పు మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో లక్ కలసి వస్తుంది. ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు విదేశాలకు కూడా వెళ్లొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ వ్యాపారం పురోభివృద్ధి చెందుతుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది.


Also Read: Guru Vakri 2023: డిసెంబర్ 23 వరకు ఈ 3 రాశుల వారికి స్వర్ణయుగమే..జాక్‌పాట్ కొట్టేశారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook