Rahu Blessing Zodiac: మీనరాశిలో రాహు సూర్య గ్రహాల కలయిక..ఈ రాశుల వారు సంపన్నులు కాబోతున్నారు..
Rahu-Surya Yuti 2024 March In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలోని మార్చి నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీనరాశిలో రాహువు, సూర్య గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Rahu-Surya Yuti 2024 March In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు నిర్దిష్ట సమయంలో మాత్రమే సంచారం చేస్తాయి కాబట్టి ఈ ఇలాంటి సమయంలో సంచారం చేసే గ్రహాల ప్రభావం అన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడుతుంది. దీంతో వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ మీనరాశిలో రాహు గ్రహం ఉండగా సూర్యుడు ఈ రాశిలో సంచారం చేయడం విశేషం. అయితే ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. రాహు గ్రహంతో సూర్యుడు కలవడం కారణంగా కొన్ని శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావం పడి.. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయని, దీని కారణంగా కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశిలో రాహువు 18 నెలల పాటు ఉండబోతున్నాడు. అయితే ఇదే సమయంలో సూర్యుడు కలవడం మకర రాశి వారికి కొంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి మనశ్శాంతి పెరుగుతుంది. అంతేకాకుండా వీరు జీవితంలో కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. దీనికి కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహరాశి:
ఒకే రాశులు సూర్య, రాహు గ్రహాల కలయిక కారణంగా సింహ రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆలోచన శక్తి పెరుగుతుంది. దీని కారణంగా తెలివితేటలు పెరిగి ఎత్తులకుపై ఎత్తులు సాధించగలుగుతారు. దీంతోపాటు మీపై మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం మధురానుభూతులను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాలు కలయిక అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతోపాటు వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి పెద్ద ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రశంసలు కూడా అందుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ సమయంలో వీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter