Guru Blessing Zodiac: 2023 చివరి గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి 2024లో ఊహించని లాభాలు..
Guru Transit December 2023: ఈ సంవత్సరం చివరి గృహస్పతి గ్రహం ఈరోజు రాశి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడి..ఈరోజు నుంచి ఆ రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి.
Guru Blessing Zodiac From Today: ఈ సంవత్సరం చివరిగా బృహస్పతి గ్రహం ఆదివారం (ఈరోజు) సంచారం చేసింది. ఈ గ్రహం ప్రతినెల ఒక రాశి నుంచి మరో రాశికి సంసారం చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం 8:09 గంటలకు ఈ గ్రహం మేషరాశిలోకి సంచారం చేసింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి వివాహం, విద్య, సంతానం కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా ఏర్పడే ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా పడబోతోంది. దీనికి కారణంగా ఆ రాశుల వారు ఊహించని లాభాలు పొందడమే కాకుండా సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశికి బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.. విద్యార్థులకు విద్యపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కుటుంబ మద్దతు లభించి, అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మాధుర్యమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. భాగస్వామితో కలిసి ఎంతో ఆనందంగా జీవించబోతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి రాశి వారికి ఈ సంచారం 11వ స్థానంలో జరగబోతోంది. దీనికి కారణంగా వీరు అనేక ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ తో పాటు జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటినుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. కెరీర్లు ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా పాత ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఇంతకుముందున్న దానికంటే కొంత మెరుగుపడుతుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మేష రాశి:
డిసెంబర్ 31న జరిగిన బృహస్పతి సంచారం మేష రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన విపరీతమైన లాభాలు పొందుతారు. తెలివితేటలను వినియోగించి కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలను ఒక ప్రణాళిక పద్ధతిలో నడపడం కారణంగా గొప్ప విజయాలు సాధిస్తారు వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సంచారం ఎంతో ఆనందాన్ని కలిగించబోతోంది. ఇవే కాకుండా అనేక రకాల లాభాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter