Five Rajyog In Transit Kundli 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా మార్చడం ద్వారా రాజయోగాలను సృష్టిస్తాయి. సుమారు 700 సంవత్సరాల తర్వాత 5 రాజయోగాల యాదృచ్ఛికం జరగబోతుంది. ఆ యోగాలే కేదార్, హన్స్, మాలవ్య, చతుశ్చక్ర మరియు మహాభాగ్య. దీని ప్రభావం నాలుగు రాశులవారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరియు అపార ధనాన్ని పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులకు అదృష్ట యోగం
కర్కాటక రాశిచక్రం
మీ జాతకంలో హన్స్ మరియు మాళవ్య రాజయోగం ఏర్పడటం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మరియు బృహస్పతి మీ రాశి ద్వారా భాగ్యస్థానంలో ప్రయాణిస్తున్నారు. దీంతో మీ అదృష్టం ప్రకాశించనుంది. కెరీర్ లో మీరు కోరుకున్న స్థానానికి వెళతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. 
కన్య రాశిచక్రం
5 రాజయోగాలు ఏర్పడటం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో మీ లైఫ్ పార్టనర్ సపోర్టు దక్కుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే అనుకూల సమయం. లవ్ లైవ్ బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా సూపర్ ఉంటుంది. 
మిథున రాశిచక్రం
ఐదు రాజయోగాలు ఏర్పడటం మిథునరాశి వారికి కలిసి వస్తుంది. మీ జాతకంలో శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉండటం మరియు బృహస్పతి దానితో కలిసి ఉండటం వల్ల హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. 
మీన రాశిచక్రం
హన్స్ మరియు మాళవ్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. మీకు పని లేదా వ్యాపారంలో విజయం దక్కుతుంది. ఆఫీసులో మీకు ప్రశంసలు దక్కుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 


Also Read: Mangal Gochar 2023: మరో వారంలో మిథునంలోకి కుజుడు.. దశ తిరగనున్న రాశులివే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook