Aditya transit 2023: శుక్రుడి రాశిలో ఆదిత్యుడి సంచారం.. ఈ 3 రాశులకు కష్టకాలం..
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు మే 15న వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశిలో ఆదిత్యుడు సంచారం వల్ల మూడు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Sun transit 2023 effect: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. ప్రస్తుతం ఆదిత్యుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు మరో 5 రోజుల్లో అంటే మే 15న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. వృషభరాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశిలో సూర్యుడి సంచారం వల్ల మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం.
ఈ రాశులవారు జాగ్రత్త
మిథునరాశి - ఆదిత్యుడు గోచారం మీరాశి యెుక్క పన్నెండవ ఇంట్లో సంభవించబోతుంది. ఈ సమయంలో మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. డబ్బు వృథా అవుతుంది. మీకు కాలం అస్సలు కలిసిరాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.
తుల - తులరాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో భానుడు సంచరించనున్నాడు. ఈ మార్పు కారణంగా మీ ఇంట్లో గొడవలు తలెత్తుతాయి. మీ దాంపత్య జీవితంలో విభేదాలు వస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం కాదు. ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి హెల్త్ పై శ్రద్ధ తీసుకోండి. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు కలుగుతాయి.
మేషం - సూర్యుడి గోచారం మేష రాశి యెుక్క రెండో ఇంట్లో జరగబోతుంది. కుటుంబంలో భూవివాదాలు తలెత్తుతాయి. లవ్, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరికీ అప్పు ఇవ్వద్దు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఈ సమయంలో ఆలోచించే మాట్లాడండి. మీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో ఇబ్బందులను ఎదుర్కోంటారు.
Also Read: Jupiter Rise 2023: ఏడాది పాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.