ఒంటిపై బట్టల్లేకుండా, ఒళ్లంతా విభూతి లేదా చితాభస్మం రాసుకుని విచిత్రంగా, భయంకరంగా తపో భంగిమలో ఉండే అఘోరీలకు హిందూమతంలో ఓ ప్రాధాన్యత ఉంది. కొంతమంది ఈ అఘోరీలను అత్యంత శక్తివంతులుగా భావించి కొలుస్తుంటారు. అలాంటి ఈ అఘోరీల తెరవెనుక లేదా చీకటి రహస్యాలు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఘోరీల జీవితం, జీవించే విధానంపై చాలా చర్చ జరుగుతుంటుంది. అఘోరీల జీవన విధానం తెలిస్తే మతి పోతుంది. చట్టపరంగా అఘోరీలు చేసేది సరైంది కాకపోయినా..అఘోరీల ప్రపంచంలో ఇది సరైందే. అఘోరీలు స్మశానాల్లో మృతదేహాల్ని తింటుంటారు. కేవలం శవాలే వీరికి భోజనం. బతికున్నవి ఈ అఘోరీలు తినరు. వీరికి ఆహారం వండి తినడం రానందున పచ్చిది లేదా చితిలో కాలుకున్నవి తింటుంటారు


గంజాయి సేవించడం అఘోరీల ప్రధమ లక్షణంగా భావిస్తారు. గంజాయి అనేది అఘోరీలకు మత్తు కాదు..సమాధికి చేరుకునేమార్గం. గంజాయితో ఈ అఘోరీలు అలౌకిక సంసారంలో చేరుతారు. ధ్యానస్థితిలో ఉంటారు. సాధువుల్ని కూడా కుంభమేళా ఉత్సవాల్లో అందరి సమక్షంలో గంజాయి తాగడం చూస్తుంటాం.


అమ్మాయిలు, మహిళలతో అఘోరీలు శారీరక సంబంధాలు ఏర్పర్చుకుంటారు. స్మశానంలో మృతదేహాలతో తమ కోర్కెలు తీర్చుకుంటారు. సుఖం లేదా ఆనందం కోసం కాదని..సమాధి కోసమే ఇదంతా చేస్తామంటారు అఘోరీలు. 


ఇండియాలో ఐపీసీ సెక్షన్ 294 ఏ ప్రకారం బహిరంగంగా సెక్స్ చేయడం నేరం. ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో సాధారణంగా ఎవరూ లిప్ కిస్ కూడా చేయరు. దీనిని కూడా అశ్లీలంగానే చూస్తారు. 


ఇక ఆ తరువాత మత్తు పదార్ధాల సేవనం కూడా చట్టప్రకారం నేరం. బహిరంగంగా మత్తు పదార్ధాల అమ్మకం లేదా కొనడం శిక్షార్హం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకారం ఎన్‌‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8/20 లో..గంజాయి సేవించడం లేదా అమ్మజం నేరమని ఉంది. తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. అఘోరీల గంజాయి సేవనం, మృతదేహాలతో కామ కోర్కెలు తీర్చుకోవడం అంతా నేరమే మరి. 


Also read: Saturn rise: కుంభరాశిలో ఉదయించనున్న శని, మార్చ్ 9 నుంచి ఆ 4 రాశులకు ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook