Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయొద్దు... చేస్తే అశుభమే...
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయకి సంబంధించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆరోజున కొన్ని పనులు అశుభాన్ని కలగజేస్తాయని పండితులు చెబుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Akshaya Tritiya 2022: అక్షయం అంటే అనంతమైనది... ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే తరగని సంపద చేకూరుతుందని విశ్విసిస్తారు. కానీ అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయాలని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. కేవలం వ్యాపార దృక్పథంతోనే ఈ ప్రచారం, ఆనవాయితీ పుట్టుకొచ్చిందని చెబుతారు. అక్షయ తృతీయ రోజు చేపట్టే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానమైనా దాని ఫలితం అక్షయమవుతుందని నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్షయ తృతీయ ఎప్పుడు :
వైశాఖ మాసం శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది మే 3న అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయ నాడు ఏ పని చేపట్టినా అది సత్ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ కార్యక్రమానికైనా ఇవాళ ప్రత్యేకించి ముహూర్తం అవసరం లేదని చెబుతారు.
అక్షయ తృతీయ నాడు ఈ పనులు చేయొద్దు :
అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే అవి లేని కష్టాలు, అశుభాలను కలిగిస్తాయి.
అక్షయ తృతీయ రోజున ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లవద్దు. తప్పకుండా ఏదైనా కొనండి. బంగారం, వెండి కొనలేకపోతే నిరాశ చెందాల్సిన పనిలేదు. మట్టి పాత్రలు, ఇత్తడి మొదలైన వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. పూజలో విష్ణువుకు తులసిని సమర్పించండి. కానీ తులసిని గోటితో తుంచవద్దు. స్నానం చేయకుండా తులసిని తాకవద్దు అని గుర్తుంచుకోండి.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని, శ్రీ మహావిష్ణువును విడివిడిగా పూజించడం తప్పు. ఎల్లప్పుడూ ఆ దేవీ దేవతలను కలిపి పూజించాలి. లేదంటే ఆ దైవ అనుగ్రహం పొందలేరు.
అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఏ భాగాన్ని చీకటిగా లేదా అపరిశుభ్రంగా ఉండనివ్వొద్దు. ఇంటిని శుభ్రం చేసి ప్రతి చోటా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. తులసి కోటలో దీపం పెట్టాలి. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి.
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్యాన్ని పాటించండి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. ఎవరికీ చెడు చేసే ఆలోచన చేయొద్దు.
అక్షయ తృతీయ నాడు ఎవరైనా పేదలు ఏదైనా అడిగితే ఖాళీ చేతులతో వెళ్లనివ్వొద్దు. అతనికి ఆహారం, బట్టలు, డబ్బు ఏదైనా మీకు తోచిన దానం చేయండి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Saturn Transit 2022: నేడు కుంభరాశిలోకి శని.. ఏ రాశుల వారికి మంచిది... ఏ రాశుల వారికి చెడు జరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook