Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితంలో పెను మార్పులు..వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు..!!
Weekly Horoscope: ఈ వారంలో కొన్ని రాశుల వారికి జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా జీవితంలో మంచి, చెడు రెండు రకాల ఫలితాలను నెలకొంటాయి. కొన్ని రాశుల వారు మంచి పదవులు చేపట్టే అవకాశాలు ఉంటాయి.
Weekly Horoscope: ఈ వారంలో కొన్ని రాశుల వారికి జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా జీవితంలో మంచి, చెడు రెండు రకాల ఫలితాలను నెలకొంటాయి. కొన్ని రాశుల వారు మంచి పదవులు చేపట్టే అవకాశాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు తమ ఉద్యోగ కార్యలయాల్లో తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పలు అంశాలతో ఈ వారం రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం రాశి:
ఈ వారం ఈ రాశి వారు విద్యాపై ప్రత్యేక అసక్తి చూపుతారు. విద్యాలయాల్లో కొత్త కోర్సుల్లో చేరడాని చొరవ చూపుతారు. వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మేషం రాశి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోమరితనాన్ని వదిలేసి..విజయం దిశగా అడుగులు వేయాలి. ముఖ్యంగా కలప దుంగలు, వడ్రంగి పని చేసే వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కడపులో నొప్పులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. జీవిత భాగస్వామితో బాధపడుతున్నవారు త్వరలో శుభవార్తను పొందుతారు. వివాదాల్లోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండడం మంచిది.
వృషభం రాశి:
కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు తొందర పడకుండా ముందుగా ఈ వారంలో ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎంచుకున్న ప్లాన్ లక్ష్యం వైపు దృష్టి సారించాలి. వృషభం రాశి వారికి చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడాని పెద్ద మొత్తంలో కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సమస్యలను అధిగమించే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో ఉత్తమైన మార్గం మాత్రమే తల్లిదండ్రులు ఎంచుకోవాలి.
మిథునం రాశి:
ఈ రాశి వారు ఈ వారంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. వీరు ప్రతికూలత విషయాలకు, ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. ఎదైనా సమస్యలు వస్తే నిరుత్సాహ పడకుండా ఉండాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వ్యక్తులు ఈ వారంలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం కోసం కొంత కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వక్తులు మంచి ఫలితాలను పొందుతారు. హృదయ సంబంధిత వ్యాధులున్న మిథునం రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు కష్టడి చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు విజయం దిశగా అడుగులు వేసే క్రమంలో సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. వీరు పట్టుదలతో పని చేస్తే విజయం తప్పకుండా సాధిస్తారు. ఈ రాశి వారు వ్యాపార విషయాలలో రాజీ పడకుండా కొనసాగించవచ్చు. డ్రగ్స్ వినియోగించే వారు వాటి వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన పొందుతారు. ఈ రాశి వారు సామాజిక సేవలో భాగం అయ్యే పాటు మంచి గుర్తింపును పొందుతారు.
సింహం రాశి:
ఈ రాశి వారు ఈ వారం గందరగోళం, చికాకులను గురవుతారు. కావున వీరు ప్రశాంతంగా ఉండాలి. ఆఫీసులో వీరిపై అధికంగా పనిభారం పెరగే అవకాశాలున్నాయి. కావున ఎన్ని ఒత్తిళ్ల విధిలో ఏకాగ్రతను చూపాలి. వ్యాపారం ముందుకు సాగాలంటే ప్రమోషన్‌పై అధిక ప్రాధాన్యతను చూపాలి. అధిక పని ఒత్తిళ్ళ కారణంగా కళ్లలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ చూపాలి. ఈ రాశికి చెందిన చిన్న పిల్లల మేధో సామర్థ్యాలు పెరుగుతాయి. తల్లిదండ్రులు వారికి జ్ఞానాన్ని అందించాలి.
Also Read: Mars Solar Eclipse: ఇతర గ్రహాల్లో కూడా సూర్య గ్రహణాలుంటాయా..ఎలా ఉంటాయి
Also Read: Fourth Wave Alert: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook