Amavasya January 2023: మాఘమాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్యగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం జనవరి 21 శనివారం (ఈ రోజు)రోజున వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత మౌని అమావాస్య శనివారం రోజున వచ్చిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈరోజు పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు భక్తులంతా మౌనవ్రతాలు పాటించి పుష్కర ఘాట్ల వద్ద స్నానాలను ఆచరిస్తారు. అయితే ఈరోజు శుభసమయాలేంటో ఎలాంటి పనులను చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం మాఘ అమావాస్య జనవరి 21 ఉదయం 6:17 నుండి మధ్యాహ్నం 2:22 వరకు ఉంటుందని స్వస్తిక్ జ్యోతిష్య కేంద్రానికి చెందిన జ్యోతిషాచార్య ఎస్ఎస్ నాగ్‌పాల్ తెలిపారు. శనివారం వచ్చే అమావాస్య తిథిని శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు వచ్చిన అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఎలాంటి పని నిర్వహించిన మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 30 సంవత్సరాల తర్వాత మౌని అమావాస్య శనివారం రోజున వచ్చిందని దీనివల్ల అరుదైన యోగం ఏర్పడబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


జనవరి 17న శని గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించింది కాబట్టి మౌన అమావాస్య రోజు శని గ్రహ ప్రభావం పడబోతోంది.. దీనివల్ల అన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏర్పడే అరుదైన యోగం.. మనుషుల జీవితాల్లో చాలా రకాల మార్పులను తీసుకురాబోతోందని అభిప్రాయపడుతున్నారు.


ఈరోజు పుణ్య స్నానాలను ఆచరించి రోజంతా మౌనరతం పాటిస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహం  లభించి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా చాలామంది ఈరోజు ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు. కాబట్టి మీరు కూడా మౌన వ్రతాన్ని పాటించి మంచి ప్రయోజనాలు పొందాలని కోరుకుంటున్నాము.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook