Anagaraka Yoga 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనం, కలయిక రాశిచక్రంలోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ప్రస్తుతం కుజుడు, రాహువు మేష రాశిలో సంచరిస్తున్నందున అంగారక యోగం నడుస్తోంది. కుజుడు జూన్ 27న మేష రాశిలో ప్రవేశించాడు. ఆగస్టు 10 వరకు మేష రాశిలోనే ఉండనున్నాడు. కుజుడి ప్రవేశం కన్నా ముందే మేష రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. అలా కుజ, రాహువు కలయికతో అంగారక యోగం ఏర్పడింది. ఈ యోగం 4 రాశుల వారికి హాని కలిగించనుంది. కాబట్టి అంగారకయోగంలో ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ 4 రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మేష రాశిలోనే కుజ, రాహువు కలయిక జరిగినందునా అంగారకయోగ ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోకపోతే లేనిపోని తగాదాలు తలెత్తవచ్చు.


వృషభం (Taurus)


వృషభ రాశి వారి జాతకంలో దశమ స్థానంలో అంగారక యోగం ఏర్పడుతోంది. ఇది ఆర్థికపరమైన నష్టాలకు, ప్రమాదాలకు సంకేతం. కాబట్టి ఈ కాలంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.


కర్కాటక రాశి (Cancer)


తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా, ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 


తులారాశి (Libra)


తులా రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తవచ్చు. వృత్తి సంబంధాల్లోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలి.


సింహ రాశి (Leo)


సింహ రాశి వారి జాతకంలో 9వ ఇంట్లో అంగారకయోగం ఏర్పడుతోంది. ఇది అనారోగ్యానికి సంకేతం. అలాగే దురదృష్టానికి సంకేతం. ఈ కాలంలో అనారోగ్య సమస్యలతో పాటు ప్రతీ పనిలో చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. 



(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Palnadu: పల్నాడు జిల్లాలో పరువు హత్య కలకలం..కొడుకును చంపిన తల్లిదండ్రులు..!


Also Read: August Bank Holidays: ఖాతాదారులకు హెచ్చరిక.. ఆగ‌స్టులో ఏకంగా 18 రోజులు బ్యాంకులకు సెలవులు 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook