Apara Ekadashi 2022: అపర ఏకాదశి. హిందూవులకు పవిత్రమైన రోజు. మే 26న వస్తున్న ఆపర ఏకాదశికి ఏం చేయాలి. పూజలు ఎలా చేయాలి, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటనే విషయాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపర ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే విష్ణు భగవానుడి కటాక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం. మే 26 గురువారం నాడు అపర ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి, పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, శుభ ముహూర్తమేంటనేది పరిశీలిద్దాం..


జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షం ఏకాదశి తిధి నాడు అపర ఏకాదశి వ్రతం ఆచరిస్తుంటారు. ఈ రోజు విష్ణు భగవానుడిని విధివిధానాలతో పూజలు చేస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి. ఆపర ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే విష్ణు భగవంతుడి కటాక్షం లభిస్తుందట. అపర ఏకాదశి ముహూర్తం, పూజా విధానాలు ఇలా ఉన్నాయి.


అపర ఏకాదశి మహత్యం


అపర ఏకాదశి నాడు తెలిసో తెలియకో జరిగిన తప్పుులు,పాపాల్నించి విముక్తి కోసం విష్ణుపూజ చేస్తారు. ఈ ఏకాదశి వ్రతం చేస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది. అపర ఏకాదశి నాడు విష్ణు యంత్రానికి పూజ చేసి అర్చన చేస్తే చాలా మహత్యముంటుందట. ఈ ఏకాదశి నాడు భక్తులు వ్రతం ఆచరించి సాయంత్రానికి విష్ణుపూజ చేస్తారు. 


పూజ ఎలా చేయాలి


అపర ఏకాదశి నాడు విష్ణు భగవంతుడి పూజ ఒకరోజు ముందు అంటే దశమి రాత్రి నుంచి ప్రారంభమైపోతుంది. దశమి తిధి రోజు సూర్యాస్తమయం తరువాత భోజనం చేయకూడదు. ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి..గంగానీటితో స్నానమాచరించాలి. తూర్పుగుమ్మానికి  పసుపు వస్త్రం కట్టి..విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆ తరువాత దీపాలు వెలిగించి కలశం అమర్చాలి. విష్ణు భగవానుడికి పండ్లు పూలు, పాన్, సుపారీ, కొబ్బరికాయ, లవంగం వంటివి అర్పించాలి. మొత్తం రోజంతా ఏం తినకుండా సాయంత్రం అపర ఏకాదశి వ్రతం కధను పూర్తిగా విని అప్పుడు ఏమైనా తినాలి. సాయంత్రం వేళ విష్ణు భగవంతుడి విగ్రహం ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. 


అపర ఏకాదశి ముహూర్తం


ఏకాదశి తిధి మే 25వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల 32 నిమిషాల్నించి ప్రారంభమై మే 26వ తేదీ ఉదయం 10 గంటల 54 నిమిషాల వరకూ ఉంటుంది. వ్రత పారాయణాన్ని మే 27వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల 25 నిమిషాల్నించి 8 గంటల 10 నిమిషాల వరకూ ఉంటుంది.


Also read: Hibiscus plants: ఇంట్లో మొక్కలకు వాస్తు ఉంటుందా..మందార మొక్కల్ని ఏ దిశలో పెంచాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook