Planet Changes in April 2023: ఏప్రిల్ లో రాశిని మార్చబోతున్న గ్రహాలు.. దశ తిరగనున్న రాశులివే!
April Month Horoscope 2023: ఈనెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు గురుడు తమ తమ రాశులను మార్చనున్నారు. ఇది కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది..
April Month Horoscope 2023: గ్రహాల కదలికల పరంగా ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకం. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెలలో కనిపించనుంది. అంతేకాకుండా గ్రహాల కమాండరైన బృహస్పతి ఈ నెలలో సుమారు 13 నెలల తర్వాత తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. గురుడు మేషరాశిలో రాహు గ్రహంతో కలిసి గురు చండాల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీంతోపాటు ఇదే నెలలో సూర్యుడు, శుక్రుడు మరియు బుధ గ్రహాలు కూడా తమ రాశిని మార్చుకుంటాయి. గ్రహాల గమనంలో మార్పు కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
సూర్యుడి గోచారం:
ఈనెల 14, మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించననున్నాడు. ఈ రాశిలో సూర్యుడు మే 15వ తేదీ వరకు ఉంటాడు. అనంతరం వృషభరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు.
గురు సంచారం:
దేవగురు బృహస్పతి ఏప్రిల్ 22, 2023 ఉదయం 6.12 గంటలకు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బృహస్పతి సంచారం రాహువుతో మైత్రిని సృష్టిస్తుంది. దీని కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది.
శుక్రుడి రవాణా:
ఆనందానికి, తేజస్సుకు కారకుడైన శుక్రుడు రేపు అంటే ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11.10 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశించి మేష రాశి ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. మే 2 వరకు శుక్రుడు ఈ రాశిలో ఉంటాడు. అనంతరం మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు.
Also Read: Surya Gochar 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
బుధుడు తిరోగమనం:
ఏప్రిల్ 21న బుధుడు మేషరాశిలో తిరోగమనం చేయనున్నాడు. దీని తర్వాత ఏప్రిల్ 23 రాత్రి 11.58 గంటలకు మేషరాశిలో అస్తమించనుంది.
గ్రహాల సంచారం ఈ రాశులకు వరం
వృషభం:
వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు త్వరలో పూర్తవుతాయి.
మిధునరాశి:
ఈ గ్రహాల సంచార సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
కర్కాటక రాశి:
గ్రహాల సంచారం ఈ రాశివారికి వరమనే చెప్పాలి. భూమి, ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది.
కుంభ రాశి:
కుంభరాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. భారీగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Mercury retrograde 2023: వక్రమార్గంతో మేషరాశిలో బుధుడు, 4 రాశులవారికి ఊహించని లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook