Garuda Puranam: జీవితంలో ఈ 4 పనులు చేసినవారికి మరణానంతరం మోక్షమార్గమేనట..!
Garuda Puranam: మన పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు. జీవితంలో నాలుగు మంచి పనులు చేయండి అని.. అయితే, గరుడ పురాణం ప్రకారం కూడా మీరు జీవితంలో ఓ నాలుగు పనులు చేస్తే మీ మరణానంతరం మోక్షమార్గం పొందుతారట. అవేంటో తెలుసుకుందాం.
Garuda Puranam: మన పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు. జీవితంలో నాలుగు మంచి పనులు చేయండి అని.. అయితే, గరుడ పురాణం ప్రకారం కూడా మీరు జీవితంలో ఓ నాలుగు పనులు చేస్తే మీ మరణానంతరం మోక్షమార్గం పొందుతారట. అవేంటో తెలుసుకుందాం.
సాధారణంగా మనం మరణానంతరం మోక్షం పొందడానికి వివిధ ప్రయత్నాలు చేస్తాం. గరుడ పురాణంలో జీవించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. దీంతో మీరు సులభంగా మోక్షమార్గం పొందడానికి అవి సహాయపడుతుందని ఉంది.
గరుడ పురాణం జనన మరణానికి సంబంధించిన అనేక రహస్యాల గురించి చెబుతుంది. ఇది పాప, పుణ్యాలు, కర్మల వృత్తాంతాన్ని కూడా చెబుతుంది. ఏ పనుల వల్ల ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు? అని గరుడ పురాణం ఉంది. ఇది విష్ణువు అతని వాహనం అయిన పక్షి రాజు గరుడ మధ్య సంభాషణ జరిగింది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 4 పనులు చేస్తే, అతని ఆత్మ మరణానంతరం మోక్షం వైపు వెళుతుందని పేర్కొంది.
ఇదీ చదవండి: Marriage Remedies: పెళ్లి కావడం లేదా? చివరగా ఈ ఒక్కప్రయత్నం చేయండి.. త్వరగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది..
1. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ శ్రీ హరి నామాన్ని జపించాలి. అలాగే చివరి క్షణాల్లో నారాయణుని నామస్మరణ చేసి ఆయన దశావతారాలను పూజించడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది.
2. గరుడ పురాణం ప్రకారం కలియుగంలో గంగా స్నానం చేయడం వల్ల కూడా ఒక వ్యక్తి పాపాలు నశిస్తాయి. అతనికి మోక్షం తలుపులు తెరుచుకుంటాయి.
3. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. గరుడ పురాణంలో తులసి సర్వోన్నత స్థానానికి తీసుకువెళ్లేదిగా కూడా వర్ణించబడింది. తులసి మొక్కను నిత్యం పూజిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా, మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకులను ఉంచడం వల్ల అతనికి మోక్షం తలుపులు కూడా తెరచుకుంటాయి.
ఇదీ చదవండి: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..
4. హిందూ మతంలో ఏకాదశి రోజున ఉపవాసం మోక్షాన్ని ఇస్తుందని భావిస్తారు. ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను గరుడ పురాణంలో కూడా వర్ణించారు. దీని ప్రకారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి, అతని అన్ని పాపాలు నశించి, మోక్షాన్ని కూడా పొందుతాడు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook