Ashadha Purnima 2022: ఆషాఢ పూర్ణిమ ఉపవాసం, పూజా విధానం, చంద్రోదయ సమయం
Ashadha Purnima 2022: ఇవాళే ఆషాఢ పౌర్ణమి. ఈ రోజున ఉవవాసం ఉండి శ్రీహరిని పూజించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.
Ashadha Purnima Puja tips: హిందూమతంలో పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈసారి పౌర్ణమి జూలై 13 అంటే ఇవాళ వచ్చింది. అషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను ఆషాఢ పౌర్ణమి (Ashadha Purnima 2022) లేదా గురు పౌర్ణమి అంటారు. ఈ రోజు స్నాన దానంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు, తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆషాఢ పూర్ణిమ పూజ సమయం మరియు చంద్రోదయ సమయం తెలుసుకుందాం.
చంద్రోదయ సమయం
పౌర్ణమి రోజున పాటించే ఉపవాసం రాత్రి చంద్రుని దర్శనం తర్వాత మాత్రమే విరమించబడుతుంది. ఆషాఢ పూర్ణిమ శుభ సమయం జూలై 13 ఉదయం 04:01 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. ఈ సమయంలో ఎప్పుడైనా పూజలు చేయవచ్చు. చంద్రోదయం జూలై 13 రాత్రి 8:59 గంటలకు ఉంటుంది.
పూజా విధానం
పూర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. వీలుకాకపోతే నీటిలో కొద్దిగా గంగాజలం వేసి స్నానం చేయవచ్చు. ఇది పూర్తయిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి పూజా గదిలో కూర్చుని విష్ణువును పూజించడంతో పాటు మీ ఇష్టమైన దేవుడిని ఆరాధించండి. అలాగే లక్ష్మీదేవికి పూలమాల సమర్పించి.. పూజించండి. పౌర్ణమి రోజున విష్ణుమూర్తికి పసుపు చందనం పూయండి. కొన్ని పసుపు స్వీట్లను పెట్టండి. అనంతరం ధూపం వేసి.. దీపం వెలిగించండి. తర్వాత శ్రీ సత్యనారాయణ కథ చదవండి. చివరకి హారతి ఇచ్చి ప్రసాదం పంపిణీ చేయండి.
Also read: Guru Purnima 2022: గురు పూర్ణిమ నాడు ఇంద్రయోగం.. మీ గురు దోషాన్ని ఈ నివారణలతో తొలగించుకోండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook