Vastu Tips: మీ ఇంట్లో ఈ పరిణామాలు జరుగుతున్నాయా..అయితే జాగ్రత్త, ఆర్ధికంగా దివాళాకు సంకేతాలివి
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో జరిగే ప్రతి చిన్న అంశానికి కారణం ఉంటుందంటారు వాస్తు పండితులు. అందుకే ఇంటి అమరిక, ఇంట్లో వస్తువుల స్థానం, ఇంట్లో జరిగే పరిణామాలు వాస్తు ప్రకారం ఉండాలంటారు. పూర్తి వివరాలు మీ కోసం..
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వాస్తుకు అంతే మహత్యముంది. వాస్తవానికి ఈ రెండూ వేర్వేరు కావు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులుంటే ఆ వ్యక్తి దివాళా అవుతాడని నమ్ముతారు. కొన్ని వస్తువుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తీవ్రమైన ధననష్టం సంభవించవచ్చు. అందుకే వాస్తు ప్రకారం ఇంట్లో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ఏవి ఎక్కడుండాలి, ఎక్కడుండకూడదనేది పూర్తిగా తెలుసుకోవాలి.
వాస్తు శాస్త్రంలో విభిన్న అంశాలు, పరిణామాలకు శుభ, అశుభ సంంకేతాలుగా భావిస్తారు. భావిష్యత్తులో జరగనున్న అనుకూల లేదా ప్రతికూల ప్రభావం సంకేతాలు ఆ వ్యక్తికి ముందుగానే తెలుస్తుంది. అయితే ఈ సంకేతాలు లేదా లక్షణాల్ని సకాలంలో గ్రహించగలగాలి. వాస్తవానికి జీవితంలో ఎదురుకానున్న కష్టాలైనా లేదా సుఖాలైనా సరే ముందే వివిధ రూపాల్లో అప్రమత్తం చేస్తాయి. అవగాహన లేకపోవడంతో చాలామంది వీటిని గ్రహించలేరు. దాంతో సమస్యలు ఎదుర్కొంటారు. జ్యోతిష్యశాస్త్రంలో ఓ వ్యక్తికి ధనలాభం కలిగే పరిస్థితి ఉంటే ముందుగానే దానికి సంబంధించిన సంకేతాలు లభిస్తాయి. లక్ష్మీదేవి ఒకరి ఇంట్లో ప్రవేశించాలంటే ముందుగా ఆ ఇంట్లో కొన్ని సంకేతాలు లభిస్తాయిట. అదే విధంగా శుభం జరగానికి ఏ విధంగా సంకేతాలు ముందుగా లభిస్తాయో అదే విధంగా ధనహాని లేదా ధననష్టం కలిగే అవకాశాలుంటే ముందుగా కొన్ని సంకేతాలుంటాయి.ఈ సంకేతాలు ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, పేదరికం గురించి ముందుగా సూచిస్తాయి. అలాంటి కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.
ఈ సంకేతాలు కన్పిస్తే లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉందని ఆర్ధం
హిందూమతం ప్రకారం బంగారం, వెండిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో నగలు దొంగతనానికి గురైతే లేదా పోగొట్టుకుంటే లక్ష్మీదేవి మీపై ఆగ్రహంగా ఉందని అర్ధం. అందుకే మీ ఇంట్లో ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోవాలి. నిరంతరం లక్ష్మీదేవిని ప్రార్దిస్తుండాలి.
జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవికి ఇంట్లో పాలకు సంబంధముంది. అందుకే పాలతో చేసిన స్వీట్స్ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమౌతుందని భావిస్తారు. ఇలా చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అదే ఇంట్లో పాలు పదే పదే ఒలిగిపోతుంటే పూర్తిగా అపశకునంగా భావించాలి. అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేందుకు ఇష్టపడటం లేదని అర్ధం. లక్ష్మీదేవికి క్షమాపణలు కోరి ప్రార్ధించాలి. ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి క్షమాపణలు కోరుకోవాలి.
మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క అకారణంగా ఎండిపోతే ఇది పూర్తిగా మంచి పరిణామం కాదంటున్నారు వాస్తు పండితులు. ఇది అశుభం జరగడానికి సంకేతమట. ఒకవేళ మీ ఇంట్లో ఇలా జరిగితే లక్ష్మీదేవి మీపై ఆగ్రహంగా ఉందని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మనీ ప్లాంట్ మొక్క ఎండిందంటే భవిష్యత్తులో తీవ్రమైన ధననష్టం కలుగుతుందని అర్ధం. అందుకే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కుళాయి కారుతుండటం మంచి లక్షణం కాదంటున్నారు. ఇలా జరిగితే ఆర్ధికంగా నష్టం జరగవచ్చు. అందుకే మీ ఇంట్లో కిచెన్, బాత్రూమ్, లేదా మరెక్కడైనా కుళాయి కారుతుంటే వెంటనే సరి చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మీ ఇంట్లో డబ్బులు క్రమక్రమంగా తగ్గిపోతుంటాయి..
Also read: Venus Rise 2023: శుక్రుడి ఉదయంతో ఆగస్టు 18 నుంచి ఆ 4 రాశులకు మహర్దశ, ఎలా ఉంటుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook