Astro Beliefs: బంగారం, వెండితో ఉండే నమ్మకాలు, బంగారం పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది
Astro Beliefs: హిందూమతంలో విభిన్న విశ్వాసాలు, విభిన్న నమ్మకాలున్నాయి. కొందరు వీటిని మూఢ నమ్మకాలు భావించినా..చాలామందికి ప్రాధాన్యత ఇస్తుంటారు. వాస్తు కావచ్చు లేదా ఇంట్లో వస్తువుల గురించి కావచ్చు. విభిన్న రకాల అంశాలు విభిన్న వస్తువులతో ముడిపడి ఉంటాయి.
హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల్లో విభిన్న అంశాల గురించి ప్రస్తావన ఉంది. ఇంటి నిర్మాణం, ఇంట్లో వస్తువుల అమరిక, దిక్కుల ప్రాధాన్యత, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు ఇలా అన్ని అంశాల గురించి వివరణ సమగ్రంగా ఉంది. చాలామంది వీటిని ఫాలో అవుతుంటారు కూడా.
మత విశ్వాసాల ప్రకారం లేదా జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల లోహాలతో శుభం, అశుభం రెండూ ముడిపడి ఉన్నాయి. అందులో ఒకటి బంగారం, వెండి వస్తువులు. బంగారం, వెండి లోహాలకు చాలా ప్రాధాన్యతే కాకుండా మహత్యం కూడా ఉంది. ఈ వస్తువులతో శుభం, అశుభం పరిణమాలు అనుసంధానితమై ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఆభరణం లభించడం లేదా కోల్పోవడం రెండూ అశుభమేనట. అందుకే బంగారం లేదా వెండి ఎక్కడైనా దొరికితే..తీసుకురాకూడదని పెద్దలు అంటుంటారు. వాస్తవానికి ఇదంతా గురుడితో సంబంధంతో ఉంటుందట. బంగారం పోగొట్టుకుంటే..నిజ జీవితంలో గురుడి అశుభ ప్రభావం ఉంటుందట.
సాధారణంగా పాతరోజుల్లో బంగారాన్ని లేదా వెండిని ఎక్కువగా ఇంట్లో దాచుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో బంగారం లేదా వెండి ఉంగరాల్ని ధరిస్తున్నారు. శాస్త్రం ప్రకారం బంగారం లేదా వెండి ఉంగరం పోతే..ఓ విధమైన అశుభమేనట. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. అందుకే బంగారం, వెండి వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఇదంతా విశ్వాసాల్ని నమ్మేవారికోసమే.
బంగారం వస్తువులు పోగొట్టుకుంటే ఏమౌతుంది
శాస్త్రాల ప్రకారం చెవి ఉంగరాలు లేదా వస్తువులు పోగొట్టుకుంటే..అశుభమే. దీనివల్ల భవిష్యత్తులో ఏదో చెడు జరుగుతుందని చెబుతారు. అదే సమయంలో ముక్కు పుడకలు వంటివి పోవడం కూడా అశుభమే. ఇలా జరిగితే తీవ్ర అవమానాలు ఎదురౌతాయట. శాస్త్రాల ప్రకారం కుడి కాలు పట్టీ పోతే సామాజిక ప్రతిష్ఠ తగ్గిపోతుందట. అటు ఎడమ కాలి పట్టీ పోతే..ఏదో తెలియని దుర్ఘటన జరగవచ్చట. శాస్త్రాల ప్రకారం గాజులు లేదా బ్రేస్‌లెట్ పోగొట్టుకోవడం అశుభమే..దీనివల్ల పరువు గౌరవ మర్యాదలు తగ్గుతాయి.
Also read: Budh Asta 2023: త్వరలో కుంభంలో బుధుడి అస్తమయం... ఈరాశుల జీవితాల్లో గందరగోళం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook