Solar Eclipse 2024 date and time in India: ఖగోళ శాస్త్రంలో సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 08న సంభవించబోతుంది. ఈసారి ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ముఖ్యంగా ఈ గ్రహణం ఉత్తర అమెరికా ఖండంపై ఏర్పడనుంది. ఈ గ్రహణం నాలుగు సంవత్సరాలలో ఇదే మొదటిది మరియు తదుపరిది 2044 వరకు కనిపించదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కనిపిస్తుందా?
సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు.  ఈ గ్రహణం ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే దీనిని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. నాసా, యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. సూర్యగ్రహణాన్ని ఎప్పుడు నేరుగా చూడకండి, దీని కోసం సోలార్ ఫిల్టర్లు లేదా ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించండి. 


ఈ పనులు చేయకండి..
గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదు. అంతేకాకుండా గ్రహాణాన్ని నేరుగా చూడకూడదని నమ్ముతారు. అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ పుల్ గా ఉండాలి. గ్రహణ కాలంలో గర్భిణులు బయటకు వెళ్లకూడదు, అంతేకాకుండా షార్ప్ అయిన వస్తువులను ఉపయోగించకూడదు. ఈ టైంలో పూజలు చేయడం నిషేధం. ఆహారం కూడా తినడ కూడదని నమ్ముతారు. 


Also Read: Holi Colour: హోలీ రోజు ఏ రాశి వారు ఏ కలర్ తో హోలీ ఆడాలో తెలుసా?


Also Read: Surya Gochar 2024: దాదాపు 12 ఏళ్ల తర్వాత కలవబోతున్న సూర్యుడు-గురుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి