Surya Grahan 2024 effect: హిందువులు గ్రహణాలను చెడుగా భావిస్తారు. రీసెంట్ గా తొలి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది జరిగిన మరో 15 రోజుల్లో మెుదటి సూర్యగ్రహణం సంభవించబోతుంది. చైత్ర నవరాత్రులకు ఒక రోజు ముందు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం జరగబోతుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 నుండి మధ్యాహ్నం 2:22 వరకు ఉండబోతుంది. చంద్రగ్రహణం వలె సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించదు, కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం మీనరాశిలో ఏర్పడబోతుంది. దీని ప్రభావం వృషభం, మిధునం, కర్కాటకం, తుల, కుంభ రాశుల వారిపై కనిపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయే దేశాల్లో కనిపించనుంది..
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, అరుబా, బెర్ముడా, కరీబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, కోస్టా రికా, క్యూబా, డొమినికా, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, జమైకా, నార్వే, పనామా, నికరాగ్వా, రష్యా, ప్యూర్టో రికో, సెయింట్ మార్టిన్‌, స్పెయిన్ దేశాల్లో కనిపించనుంది. 


ఈ పనులు చేయడం మానుకోండి..
సూర్యగ్రహణం సమయంలో తినడం లేదా తాగడం మానుకోండి. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహణం పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. ఈ సమయంలో దేవుడి విగ్రహాలను తాకడం, పూజలు చేయడం నిషేధం. ఈ సమయంలో దేవతల పేర్లను జపించడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా గంగాజలంతో ఇంటి మెుత్తాన్ని శుభ్రంగా తడపండి. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Sankashtahara Chaturthi 2024: సంకష్టహర చతుర్థి.. వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక్కటే మార్గం..


Also Read: Astrology: రేపటి నుండి ఈ 3 రాశులవారికి సుడి తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి