దేవగురువుగా భావించే బృహస్పతి మార్చ్ నెలలో ఉదయించనున్నాడు. హిందూమతం ప్రకారం ఈ గ్రహాన్ని ధనం, సంపద, చదువు, ఉన్నత స్థానానికి ప్రతీకగా భావిస్తారు. గురుడు మీనరాశిలో ప్రవేశం కారణంగా కొన్ని రాశులకు మంచి రోజులు ప్రారంభమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమత జ్యోతిష్యం ప్రకారం గురువు మీనరాశి ప్రవేశం కారణంగా కొన్ని రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. ప్రత్యేకించి గురువు ఎవరి జాతకం కుండలిలో గురువు శుభస్థానంలో ఉన్నాడో..ఆ జాతకం వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. భారీ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఏ పని చేపట్టినా అద్భుతంగా పూర్తి చేస్తారు. 


కుంభరాశి


దేవగురువు ఉదయించడం కుంభరాశివారికి అత్యంత శుభదాయకం కానుంది. ఈ సందర్భంగా వీరికి అదృష్టం మారనుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితులు పటిష్టమౌతాయి. ప్రత్యేకించి చదువు, మీడియా రంగాలకు చెందినవారికి చాలా లాభదాయకం.


మిధునం


గురువు ఉదయించడం మిధునరాశి జాతకులకు శుభసూచకం కానుంది. కెరీర్‌పరంగా ఇది అత్యంత అనువైన మంచి సమయం. ఉద్యోగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కావల్సినచోటికి బదిలీ చేయించుకోవచ్చు. వ్యాపారులకు ఈ సమయం చాలా మంచిది.


కర్కాటకం


మార్చ్ నెల నుంచి కర్కాటక రాశి జాతకులకు అదృష్టం తిరిగిపోనుంది. ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభమైనట్టే. గురువు ఉదయించడం వల్ల కర్కాటక రాశివారికి అదృష్టం తోడవడంతో ప్రతి పని పూర్తవుతుంది. వ్యాపార సంబంధ యాత్రలు చేస్తారు. ఫలితంగా లాభాలు చేకురుతాయి.


మీనరాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశికి అధిపతి కూడా గురువే. ఈ క్రమంలో గురువు ఉదయించడజం వల్ల మీనరాశి జాతకులకు లెక్కలేనంతగా ప్రయోజనం కలుగుతుంది. దీర్ఘకాలంగా చిక్కుకున్న డబ్బులు చేతికి అందుతాయి. ఆదాయంలో కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 


Also read: Shani Asta 2023: శని అస్థిత్వం ప్రభావంతో..ఆ మూడు రాశులకు జనవరి 30 నుంచి డబ్బే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook