Marriages: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం మూఢం ప్రారంభమైంది. అంటే గ్రహాల యోగం సరిగ్గా లేని సమయం. ఈ సమయాన్ని అరిష్టంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్ల వంటి శుభాకార్యాలు తలపెట్టరు. పెళ్లికానివారు మూఢం దాటేవరకూ ఆగాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితి, రాశుల కదలికను బట్టి అందరికీ కొంతకాలం మూఢంగా పరిగణిస్తారు. గురుగ్రహం సూర్యుడికి సమీపంలో ఉన్నప్పుడు, శుక్రగ్రహం సూర్యుడిని దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించరు. అశ్వయుజ మాసంలో శుభకార్యాలు చేయడం మొదలు పెడతారు. ఈసారి కూడా అదే విధంగా పుష్యమాసంలో తప్ప మిగిలిన సమయంలో చాలా శుభ కార్యాలు జరిగాయి. పెళ్లిళ్లు అత్యవసరమైతే అనుకూల వాతావరణాన్ని కల్పించుకుని చేసుకోవడం సహజమే. 


పెళ్లిళ్లకు ముహూర్తం ఉన్న సమయంలో మాత్రం మార్కెట్ కళకళలాడుతుంటుంది. వస్త్రవ్యాపారం, బంగారు వ్యాపారం, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రవాణా ఇలా అన్నింటికీ డిమాండ్ ఉంటుంది. బ్రాహ్మణులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మూఢం ప్రారంభమైంది. మరో మూడు నెలల వరకూ అంటే ఆగస్టు 8 వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. మూఢం ఇవాళ అంటే  ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకూ ఉంటుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల్లో ఏ విధమైన శుభ కార్యాలు జరగవు. 


Alsoi read: Weekly Lucky Zodiacs: మే మొదటి వారం టాప్‌ 4 లక్కీ రాశులు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook