Elaichi Remedies: ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కన్పించే సుగంధ ద్రవ్యం ఇలాచీ. ఆరోగ్యపరంగా అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు జ్యోతిష్య ప్రకారం కూడా చాలా మహత్యముందంటున్నారు జ్యోతిష్య పండితులు. జ్యోతిష్యానికి ఇలాచీకు సంబంధమేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగం లేకపోయినా..ఇంట్లో ఆర్ధిక కష్టాలు బాధిస్తున్నా జ్యోతిష్యశాస్త్రంలో చాలా పరిష్కార మార్గాలున్నాయి. ఇలాంటి సమస్యలకు ఇలాచీ పరిష్కారం సూచిస్తుందట. ఇలాచీతో కొన్ని టిప్స్ పాటిస్తే ఉద్యోగ సమస్య, ఆర్ధిక కష్టాలు దూరమౌతాయంటున్నారు. వాస్తవానికి ఇలాచీతో వంటల రుచి పెరగడమే కాకుండా..ఆరోగ్యానికి చాలా లాభం కలుగుతుంది. అదే సమయంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలాచీతో చాలా ఉపాయాలున్నాయి. ఈ పద్దతులను పాటిస్తే..ఆర్ధిక సమస్యలు దూరమై..ధనలాభం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. 


ఉద్యోగం


ఉద్యోగం కోసం చాలాకాలంగా శ్రమ పడుతున్నా ప్రయోజనం కన్పించకపోతే ఇలాచీతో ప్రయోజనం కలుగుతుందంటున్నారు. రోజూ రాత్రివేళ నిద్రించేముందు తలగడ కింద చిన్న ఇలాచీ ఉంచుకోవాలి. ఉదయం లేచిన తరువాత ఈ ఇలాచీని ఎవరైనా నిరుపేదకు దానమివ్వలి. ఇలా చేయడం వల్ల కోరిన ఉద్యోగం లభిస్తుంది.


ఆర్ధిక సమస్యలు


పసుపు వస్త్రంలో ఐదు చిన్న ఇలాచీలను కట్టి..లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచాలి. దీనివల్ల ధనలాభం కలిగి..ఆర్ధికపరమైన కష్టాలు తొలగిపోతాయి. ప్రతి గురువారం ఇలా చేయాలి. గురవారం రోజు పసుపు వస్త్రంలో ఇలాచీని కట్టి..దక్షిణతో పాటు నిరుపేదకు దానం చేయాలి. ఇలా చేస్తే అందమైన భార్య లభిస్తుంది.


ఏదైనా ముఖ్యమైన పనికోసం వెళ్తున్నప్పుడు ఒక ఇలాచీ తిని వెళ్లడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. శుక్రవారం రోజు ఐదు ఇలాచీలను లక్ష్మీదేవి పాదాలచెంత సమర్పించాలి. ఆ తరువాత వాటిని ఖజానా లేదా పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల డబ్బుల సమస్య పోతుంది.


Also read: Weight Gain Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా వేగంగా బరువు పెరగవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook