Astro Tips for Holi Color: ఈ రంగులతో హోలీ ఆడితే.. సంవత్సరం పొడవునా మీ ఇంట్లో డబ్బేడబ్బు!
These Two zodiac signs will play Holi 2023 with these colors. వృషభం మరియు తులా రాశి వ్యక్తులు ఈసారి హోలీని ఏ రంగులతో మరియు ఎలా ఆడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
These Two zodiac signs will play Holi 2023 with these colors: 'హోలీ' పండుగ వచ్చేసింది. మార్చి 8న దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ జరుపుకోనున్నారు. ఈ రంగుల పండగ కోసం మార్కెట్లలో పలు రకాల రంగులు, పువ్వులు అమ్మకానికి ఉన్నాయి. దుకాణాల్లో రంగురంగుల మాస్క్‌లు, రంగురంగుల దుస్తులు ప్రజలను ఆకర్షిస్తుండగా.. ఇళ్లలో కూడా సన్నాహాలు మొదలయ్యాయి. చదువుకుంటున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారు కూడా తమ ప్రియమైన వారితో పండుగ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా తమ తల్లి ఇంటికి వచ్చే సన్నాహాల్లో బిజీగా ఉన్నారు.
హోలీ పండుగను తమదైన రీతిలో జరుపుకోవాలని ఇప్పటికే అందరూ ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా హోలీ ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఏ రంగుతో ఆడాలో ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వృషభం మరియు తులా రాశి వ్యక్తులు ఈసారి హోలీని ఏ రంగులతో మరియు ఎలా ఆడాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం మరియు తులా రాశి వ్యక్తులు ఈ రంగులతో ఆడితే.. వారి జీవితాలు ప్రేమ మరియు రంగులతో నిండి ఉంటాయి.
వృషభ రాశి:
ఈసారి వృషభ రాశి వారు లేత రంగులతో హోలీ ఆడటం మంచిది. అయితే ఈ రంగులు రసాయన రహితంగా ఉండాలని గుర్తుంచుకోండి. పూలతో హోలీ ఆడటం ఇంకా మంచిది. ఇందు కోసం మీరు మార్కెట్ నుంచి కొన్ని పువ్వులను తెచ్చి, వాటి రేకులను తుంచాలి. ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వచ్చినట్లయితే.. ఈ రేకులు చల్లి వారిని స్వాగతించండి. ఇక రంగులతో హోలీ ఆడండి. బయటి వారితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి హోలీ ఆడండి.
తులా రాశి:
తులా రాశి వారు సుగంధ ద్రవ్యాలు మరియు పరిమళ ద్రవ్యాలతో ఇతరులతో హోలీ ఆడండి. రోజ్ వాటర్‌తో కూడా హోలీ ఆడవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు మర్యాదను కాపాడుకోవాలి. రంగులతో ఆడుకున్న తర్వాత నిశ్శబ్దంగా కూర్చుని రస్మలై వంటి జ్యుసి స్వీట్లను ఇతరులకు తినిపించండి. ఇలా చేస్తే సంవత్సరం పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.