Turmeric Remedies: మన భారతీయ వంటకాలలో వాడే అతి ముఖ్యమైన పదార్థం పసుపు. ఇది వంటకానికి రంగును మాత్రమే కాదు మంచి రుచిని కూడా ఇస్తుంది. దీనిని ఆయుర్వేద ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. దీనిలో ఉండే ఔషద గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని గొప్ప గుణాలనున్న పసుపుకు (Turmeric) ఆస్ట్రాలజీలో చాలా ప్రత్యేకత ఉంది. పసుపు మీ లైఫ్ లో అన్ని ఇబ్బందులను తొలగించగలదు. పసుపు పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో బృహస్పతి బలపడాలంటే..
గురువారం విష్ణుమూర్తిని పూజిస్తారు. దీంతో లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ రోజున బృహస్పతిని కూడా ఆరాధిస్తారు. పసుపు బృహస్పతికి సంబంధించినదిగా భావిస్తారు. గురువారం నాడు పసుపుతో పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. 


డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే..
లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎల్లప్పడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది. ప్రతి నెల ఈ పసుపు మూటను పవిత్ర స్థలంలో పాతిపెట్టండి. 


ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే...
శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, గురువారం నాడు పసుపుతో బ్రాహ్మణులకు శెనగపప్పు, పసుపు వస్త్రాలు మరియు శనగపిండి లడ్డూలను దానం చేయండి. దీంతో పాటు గురువారం అరటి డొప్పలో పసుపును నైవేద్యంగా పెట్టండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఆగిపోయిన పని కూడా జరగడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మీరు గురువారం ఏదైనా శుభకార్యానికి వెళుతున్నట్లయితే, వినాయకుడి నుదుటికి పసుపును పూసి కుంకుమ పెట్టండి.  ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. 


Also Read: Venus-Moon Conjunction 2022: మరో 24 గంటల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook