Astro tips For Money: సాధారణంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని అందరూ కోరుకుంటారు. ఖజానా ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టం పడి డబ్బు సంపాదించినా వారి వద్ద డబ్బు నిలువదు. దీనికి వాస్తు (Vastu tips) కూడా కారణమై ఉండవచ్చు. డబ్బును భద్రంగా ఉంచే చోటు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో ఎప్పుడూ ఏదో ఒకదానిని ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఎల్లప్పుడూ వీరిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తామర పువ్వు: మీరు డబ్బు పెట్టే లాకర్ లేదా బీరువాలో తామరపువ్వును ఉంచడం చాలా శ్రేయస్కరం. తామర పువ్వును ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది మరియు లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. 


పసుపు ముద్ద: మీ ఆర్థిక పరిమితులను తొలగించడంలో పసుపు ముద్ద సహాయపడుతుందని నమ్ముతారు. ఇది అనేక మతపరమైన కార్యక్రమాలలో కూడా ఉపయోగించబడుతుంది. ఇందుకోసం గురువారం లేదా శుక్రవారాల్లో పసుపు ముద్దను ఎర్రటి గుడ్డలో చుట్టి డబ్బు ఉన్న స్థానంలో ఉంచాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఐశ్వర్యం పెరుగుతుంది.  


పసుపు కొమ్ము: పసుపు కొమ్ము తల్లి లక్ష్మికి చాలా ప్రీతికరమైనది. డబ్బు ఎల్లప్పుడూ తమ వద్ద ఉండాలని కోరుకునేవారు దీపావళి లేదా ధంతేరస్ రోజున పూజించిన తర్వాత పసుపు కొమ్ములను ఖజానాలో ఉంచుతారు. అలాగే వీటిని మీరు ఏదైనా శుక్రవారం లేదా పౌర్ణమి రోజున కూడా ఉంచవచ్చు.


అద్దం: వాస్తులో అద్దం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అద్దంలో ఏది చూసినా రెట్టింపు అవుతుందని అంటారు. అందువల్ల, సేఫ్ యొక్క ఉత్తరం వైపున ఒక చిన్న అద్దం ఉంచండి. యమ స్పీడ్‌తో మీ డబ్బు ఎలా పెరుగుతుందో చూడండి.


ఎర్రని వస్త్రం: ఎర్రని వస్త్రం లక్ష్మి తల్లికి చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. కావున, 11 లేదా 21 రూపాయలు డబ్బును ఉంచే స్థలంలో ఎర్రటి గుడ్డలో కట్టి, పూర్ణిమ, ధంతేరస్ లేదా దీపావళి వంటి ఏదైనా శుభ దినాన ఉంచండి లేదా ఎరుపు రంగు దుస్తులను మార్చండి. ఇలా చేయడం వల్ల సంపద పెరగడం ప్రారంభమవుతుంది.


Also read: Samudrika Shastra: అలాంటి వేళ్లు ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు! మీ వేళ్లు అలా ఉన్నాయామో చూసుకోండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook