Shani Mahadasha: శని మహాదశ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు, నష్టాలు, పరిహారాలు
Shani Mahadasha: మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. అందుకే ఆయనను కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. అలాంటి శనిదేవుడి వక్రదృష్టి నివారించడానికి ఈ చర్యలు తీసుకోండి.
Shani Mahadasha Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. ఇతడు వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని దేవుడు వక్రదృష్టి ఏ వ్యక్తిపై పడుతుందో అతడి జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. శని దేవుడి ఆశీర్వాదం ఎవరిపై ఉంటుందో వారు ధనవంతులు అవుతారు. సాధారణంగా శనిమహాదశ (Shani Mahadasa) 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో శని ప్రతికూల దృష్టి ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. శని అనుగ్రహం ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తి అనేక లాభాలను పొందుతాడు.
శని మహాదశ నష్టాలు, లాభాలు
మీ జాతకంలో అద్భుతమైన యోగం ఉన్నప్పటికీ మీరు చేసే పనులు మంచివి కాకపోతే మీకు ఖచ్చితంగా శనిదేవుడు హాని కలిగిస్తాడు. మీరు ఆర్థికంగా దివాలా తీసే స్థితికి తీసుకొస్తాడు. మీ జాతకంలో శని అనుకూలంగా ఉండి తృతీయ, ఆరు, పదకొండో స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తికి చాలా డబ్బు వస్తుంది. శనీశ్వరుడు ఉచ్ఛస్థితిలో ఉన్నా లేదా సొంత ఇంట్లో ఉన్నా ప్రజలకు డబ్బుకు లోటు ఉండదు. మీపై శని మహాదశ, సాడే సతి లేదా దైయా కొనసాగుతున్నప్పటికీ శని అనుగ్రహం మీపై ఉంటే ఇక మీకు తిరగుండదు.
శనిదేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు
>> శనిదేవుడిని అనేక మార్గాల ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం సాయంత్రం పీపాల చెట్టు కింద ఆవనూనె దీపాన్ని వెలిగించండి. అనంతరం చెట్టు చుట్టూ కనీసం మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ సమయంలో, 'ఓం ప్రాం ప్రిం ప్రౌన్ సః శనిశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీని తరువాత ఒక పేద వ్యక్తికి నాణేలను దానం చేయండి.
>> నష్టాల్లో ఉన్న బిజినెస్ ను లాభాల్లోకి తీసుకురావాలనుకంటే శనివారం సూర్యోదయానికి ముందు పీపుల్ చెట్టుకు నీరు పోయండి. అదే సాయంత్రం చెట్టు కింద ఇనుప గిన్నెలో పెద్ద ఒత్తితో దీపం వెలిగించి అక్కడే నిలబడి శని చాలీసా చదవండి. అనంతరం పేద వ్యక్తికి ఆహారం పెట్టండి.
Also Read: Feng Shui Tips: ఇంట్లో ఆ మొక్క ఉంటే చాలు, ఆర్దిక సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook