Successful Zodiac Signs: చేతిలోని గీతలను బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేస్తారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. పుట్టిన నాటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు మన ప్యూచర్ ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో పూసగుచ్చినట్లు చెబుతారు. ఇది నమ్మడం, నమ్మకపోవడం మన మీద ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, మూడు రాశులవారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి దేనికీ లోటు ఉండదు. వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదిస్తారు. ఆ లక్కీ రాశులేంటో మనమూ తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: ఈ రాశికి చెందిన అబ్బాయిలు మరియు అమ్మాయిలు చాలా తెలివైనవారు. వీరు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. మీ కుటుంబం గర్వించే స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కోరుకున్నంత డబ్బు వస్తుంది. 
వృషభం: వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహ ప్రభావం ఈ రాశివారిపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. లక్ష్యాన్ని  సాధించడానికి ఎంత కష్టమైన పడతారు. చివరకు తమ కలను నెరవేర్చుకుంటారు. 


Also Read: Mangal shukra yuti 2023: కర్కాటక రాశిలో అరుదైన కలయిక.. 7 రాశులకు లాభం.. 5 రాశులకు నష్టం..


మకరరాశి : మకర రాశికి అధిపతి శని. వీరు చాలా మెుండిగా ఉంటారు. మకరరాశి వారు పని మెుదలుపెడితే అది అయ్యే వరకు వదిలి పెట్టరు. ఉన్నత పదవి లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో పలుకబడి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వీరు తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేస్తారు. 


Also Read: Mercury transit 2023: వృషభరాశిలో గ్రహాల రాజు, యువరాజు కలయిక.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook